Allu Arjun Vs Ramcharan.. జుగప్స.. అత్యంత జుగుప్పాకరంగా తయారైంది ‘అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్’ యుద్ధం సోషల్ మీడియాలో.! అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ ఇద్దరికీ మధ్య పైకి కనిపించేంత గొడవలేమీ లేవు.
వాస్తవానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రామ్ చరణ్ కంటే ముందు సినీ పరిశ్రమలోకి వచ్చాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడైనా, ‘మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు’ అనే ట్యాగ్‌తోనే సినీ రంగంలో సత్తా చాటాడు. అల్లు అర్జున్, చిరంజీవికి మేనల్లుడు కాదు.. చిరంజీవి, అల్లు అర్జున్‌కి మేనత్త భర్త.
ఇక, రామ్ చరణ్.. స్వాయానా అల్లు అరవింద్‌కి మేనల్లుడు. ‘బ్రదర్’ అని రామ్ చరణ్‌ని అల్లు అర్జున్ పిలుస్తుంటాడు. మరి, ఇద్దరి మధ్యా గొడవలకు ఆస్కారమేముంటుంది.?
అభిమానం కాదిది.. పైత్యం.!
సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య రచ్చ జరుగుతోంది. సభ్య సమాజం వినలేని బూతులు అందులో దర్శనమిస్తున్నాయి.

రామ్ చరణ్ (Ram Charan) సతీమణి గురించీ, అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి గురించీ జుగుప్సాకరమైన రాతలు రోత పుట్టించేస్తున్నాయి సోషల్ మీడియాలో. దీనంతటికీ ఎవరు కారణం.?
అల్లు అర్జున్ కావొచ్చు, రామ్ చరణ్ కావొచ్చు.. తమ తమ కెరీర్‌లో బిజీగా వున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వున్నారు. మధ్యలో అభిమానులకేంటి.?
Allu Arjun Vs Ramcharan.. కుటుంబ సభ్యుల్ని ఎందుకు లాగుతున్నారు.?
నెటిజనం.. అంటే, అందులో కొన్ని అసాంఘీక శక్తులు కూడా వుంటున్నాయ్. ఆ లిస్టులోకే సినీ అభిమానుల్లో కొందర్ని చేర్చేయాలేమో.!
ఖాళీగా కూర్చుని ఆయా హీరోల మీద విషం చిమ్మే సోకాల్డ్ దురభిమానులకి కఠిన శిక్షలు విధించే చట్టాలేమైనా వుంటే బావుండనిపిస్తుంటుంది ఇలాంటి సందర్భాల్లోనే.
Also Read: సమంత, నాగచైతన్య, శోభిత.. ‘ట్రయాంగిల్’ స్టోరీ వెనుక.!
హీరోల మీద విమర్శలో, సద్విమర్శలో.. అది వేరే అంశం. కానీ, ఈ వివాదాల్లోకి కుటుంబ సభ్యుల్ని ఎందుకు లాగడం.? స్నేహా రెడ్డి (Allu Sneha Reddy), ఉపాసన (Upasana Konidela).. వీళ్ళని లాగడం ఎంతవరకు నైతికత.?
చిన్న పిల్లల్ని సైతం వదలడంలేదు సోకాల్డ్ వెకిలి నెటిజనం. ఇలాంటి జుగుప్సాకరమైన సోషల్ క్రీడకి చెక్ పెట్టేదెలా.?