మన తెలుగు నాట సినీ సెలబ్రిటీలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో (Allu Sirish Vilayati Sharaab) నటించడం చాలా అరుదు. అదే, బాలీవుడ్ అయితే.. అక్కడ చాలా చాలా విరివిగా జరుగుతుంటుంది.
మ్యూజికల్ ఆల్బమ్స్ ద్వారా సక్సెస్ అయి, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టి స్టార్‌డమ్ సంపాదించుకున్న తారల లిస్ట్ కూడా పెద్దదే.
ఇక, అసలు విషయానికొస్తే.. ‘టాప్ టక్కర్’ (Rashmika Mandanna Top Tucker) అంటూ ఈ మధ్యనే హీరోయిన్ రష్మిక మండన్న (Rashmika Mandanna) ఓ మ్యూజికల్ ఆల్బమ్ కోసం ఓ మాంఛి స్టఫ్ వున్న సాంగ్ చేసింది. ఆ సాంగ్‌కి బీభత్సమైన రెస్పాన్స్ వస్తోందిప్పటికీ.
రష్మిక కోసం సెర్చ్ చేస్తోన్నవాళ్ళలో చాలామంది ‘టాప్ టక్కర్’ పొటోల్ని సెర్చ్ చేస్తుండడం ఆ మ్యూజికల్ వీడియో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందనేదానికి నిదర్శనం.
తాజాగా, మరో సౌత్ (South Cinema) సెలబ్రిటీ ఓ హిందీ మ్యూజికల్ వీడియో చేయడం గమనార్హం. ఈసారి టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.
సౌత్ నుంచి ఓ మ్యూజికల్ ఆల్బమ్ వీడియోలో నటించిన తొలి హీరో.. అంటూ అల్లు శిరీష్ గురించి ప్రచారం జరుగుతోంది. ‘విలాయతీ షరాబ్’ (Vilayati Sharaab) పేరుతో ఈ సాంగ్ బయటకు వచ్చింది.
అల్లు శిరీష్ గొప్ప డాన్సరేమీ కాకపోయినా, ఈ పాటలో స్టయిలిష్‌గా డాన్స్ మూమెంట్స్ చేసేసి (Allu Sirish Vilayati Sharaab) ‘భళా’ అనిపించుకున్నాడు. సాంగ్ విడుదలవుతూనే వైరల్ అయ్యిందంటే.. సాంగ్ ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్‌తో పోల్చితే మన తెలుగు సినీ పరిశ్రమలో డాన్సింగ్ స్టార్లు ఎక్కువ.. పైగా, స్టైలిష్ పెర్ఫామర్స్ కూడా వున్నారు. సో, ముందు ముందు ఇలాంటివి మన టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి చాలానే వస్తాయేమో వేచి చూడాలి.