Ambati Rambabu Against Amaravati.. ప్రపంచ స్థాయి రాజధాని సంగతి తర్వాత, ముందైతే ఏదో ఒక రాజధాని వుండాలి కదా.?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి వినిపించే తొలి మాట ఇది.!
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి, పదేళ్ళకు పైనే అయ్యింది. రెండు ప్రభుత్వాలూ మారాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. ప్రస్తుతం మూడో ప్రభుత్వం నడుస్తోంది.
సొంతంగా, రాజధాని అమరావతిని నిర్మించుకోలేకపోయిది ఆంధ్ర ప్రదేశ్. 2014-19 మధ్య, అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
2019-2024 మధ్య, అసలంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియని అయోమయాన్ని సృష్టించింది.. అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం.
ఓ రాష్ట్ర రాజధాని మీద, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ కక్ష పూరితంగా వ్యవహరించడం అనేది బహుశా ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా వుండి వుండదు.!
అయ్యిందేదో అయిపోయింది.. ఇప్పటికన్నా రాజధాని అమరావతి విషయంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి కదా.?
నిజమే, రాజధాని అమరావతి అంటే.. అది ప్రపంచ స్థాయి నగరంగానే వుండాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎందుకంటే, కొత్త రాజధానిని నిర్మించుకునే అవకాశం ఓ అద్భుతం.
ఇంతటి అద్భుతమైన అవకాశం లభించినప్పుడు, పూర్తిగా కొత్త ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తున్నప్పుడు, ప్రపంచ స్థాయి నగరంగా దాన్ని మలచుకోవాలి కదా.?
ప్చ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు.? అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రశ్న ఇంకెవరైనా వేస్తే, దానికో అర్థం వుంటుంది. కానీ, అయిదేళ్ళు అమరావతిని నాశనం చేసిన పార్టీకి చెందిన నాయకుడిగా అంబటి రాంబాబు, అస్సలేమాత్రం ఈ ప్రశ్న వేయడానికి వీల్లేదు.
మీడియా ముందుకొస్తే నోటికొచ్చినట్లు వాగడం అంబటి రాంబాబు లాంటి రాజకీయ నాయకులకు అలవాటే.! కానీ, రాజకీయమంటే, ప్రజా సేవ.. అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.
రాజధాని అమరావతి అంటే, అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం.! ఆలస్యం అమృతం విషం.. అంటారు పెద్దలు.! అమరావతి మరింత ఆలస్యమవడం ఎవరికీ మంచిది కాదు.!
2028 చివరి నాటికి రాజధాని అమరావతి పూర్తవుతుందని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మాటకు కట్టుబడి, యుద్ధ ప్రాతిపదికన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం మీదనే వుంది. లేకపోతే, చరిత్ర క్షమించదు.!
