Ambati Rambabu BRO.. ఆయనేమో మంత్రి.! పైగా, కీలకమైన జల వనరుల శాఖకి మంత్రి.! అలాంటప్పుడు ఆయన రివ్యూ చెయ్యాల్సింది ప్రాజెక్టుల మీద కదా.!
కానీ, ఆ సంగతి పక్కన పెట్టేసి, సినిమాల మీద రివ్యూలు చేస్తున్నారు. ఆయనెవరో కాదు మంత్రి అంబటి రాంబాబు.
వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ‘బ్రో’ సినిమా డిజాస్టర్ అని తేల్చేశారు. మొత్తంగా వసూళ్ళు డెబ్భయ్ కోట్లకు మించబోవని కూడా సెలవిచ్చారు అంబటి రాంబాబు.
ఈ వ్యవహారమిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) నటించిన ‘బ్రో’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
తమిళ సినిమా ‘వినోదయ సితం’కి ఇది తెలుగు రీమేక్. మంచి మెసేజ్‌తో రూపొందిన సినిమా ‘బ్రో’ (Bro The Avatar).! సాయి ధరమ్ తేజ్ ఇందులో కీలక పాత్ర పోషించాడు.
Ambati Rambabu BRO అవన్నీ నిర్మాత చూసుకుంటారు కదా.?
సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ వంటి విషయాల గురించి నిర్మాత చూసుకుంటాడు. ఆల్రెడీ తాము లాభాల్లో వున్నామని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చెబుతున్నారాయె.
సినిమాలో ఓ చిన్న పాత్ర ‘శ్యాంబాబు’ మీద పెద్ద రచ్చ జరుగుతోంది. ఆ పాత్ర మీద అంబటి రాంబాబుకి అభ్యంతరాలున్నాయి. అదీ అసలు సంగతి.
‘నన్ను కించపర్చడానికీ, ఎగతాళి చేయడానికే ఆ పాత్ర’ అన్నది అంబటి ఆవేదన. కోర్టును ఆశ్రయించి, ఆ సంగతేంటో తేల్చుకునే వెసులుబాటు అంబటి రాంబాబుకి (Ambati Rambabu) వుండనే వుంది.

అది మానేసి, సినిమా కలెక్షన్ల గురించి ఓ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఎంత శోచనీయం.? అయినా, మీడియాకి కూడా కాస్తంత సిగ్గుండాలి.!
కఠినమైన పదమేగానీ, నిజమే.. సిగ్గుండాలి.! సినిమా కలెక్షన్ల గురించి మంత్రి మాట్లాడుతోంటే, అది రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుందన్న కనీస విజ్ఞత మీడియాకీ లేదు మరి.!
మంత్రిగారి బాధ్యతలేంటి.?
పోలవరం ప్రాజెక్టు సంగతేంటి.? మరో ప్రాజెక్టు స్థితిగతులేంటి.? ఇవి కదా, జల వనరుల శాఖ మంత్రి మాట్లాడాల్సింది.!
అన్నట్టు, గతంలో సినిమా వసూళ్ళ గురించి మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవులు కోల్పోయారు.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
ఆ మాత్రం సోయ, ప్రస్తుత జల వనరుల శాఖ మంత్రికి వుండొద్దా.? రాజకీయ పరమైన విమర్శల్ని రాజకీయ నాయకుడిగా అంబటి రాంబాబు చేసుకోవచ్చుగాక.!
సినిమాపై తన అభిప్రాయాన్ని అంబటి రాంబాబు చెబితే, దాన్నీ తప్పు పట్టలేం. కానీ, ఇలా వసూళ్ళ లెక్కలు వివరించడం, డిజాస్టర్ అని డిక్లేర్ చేయడం ఏంటి.? పరువు పోగొట్టుకోవడం కాకపోతే.!