Ameesha Patel Gadar2.. బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గుర్తుందా.?
తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బద్రి’ సినిమాలో నటించింది కదా.? ఆ అమీషా పటేల్ గురించే.!
అమీషా పటేల్ (Ameesha Patel) తెలుగులో ఇంకొన్ని సినిమాలూ చేసింది. వాటిల్లో ‘నాని’ (Maheshbabu Nani) సినిమా కూడా ఒకటి.
గత కొంతకాలంగా సరైన సినిమాల్లేక, సోషల్ మీడియా వేదికగా హాట్ అండ్ వైల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ టైమ్ పాస్‌కే పరిమితమైపోయింది అమీషా పటేల్.
Ameesha Patel Gadar2.. లక్కు తోక తొక్కిందేమో.!
కానీ, లక్కు తోక తొక్కినట్టుంది ఈ బ్యూటీ.! అనూహ్యంగా ‘గదర్-2’ సినిమా సక్సెస్ కావడంతో, అమీషా పటేల్ మళ్ళీ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది.!

సన్నీ డియోల్ (Sunny Deol) కూడా అంతే.! చాలాకాలంగా సన్నీ డియోల్ నుంచి సరైన సినిమానే రాలేదు. ఆయనా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు.
చాలా ఏళ్ళ క్రితం విడుదలైన ‘గదర్’ (Gadar Movie) సినిమా అప్పట్లో పెను సంచలనం. ఆ స్థాయిలోనే.. ఆ మాటకొస్తే, అంతకు మించి ‘గదర్ – 2’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారిప్పడు.
ఐదొందల కోట్లు..
‘గదర్ – 2’ (Gadar 2 Movie) సినిమా వసూళ్ళ పరంగా ఐదొందల కోట్ల మార్కుని టచ్ చేయబోతోందిట.!
ఈ మధ్యకాలంలో, సరైన హిట్టు లేక బాలీవుడ్ మొత్తం చతికిలపడిపోయిన పరిస్థితిని చూస్తున్నాం. ‘గదర్’ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్ మొత్తం ఊపిరి పీల్చుకున్నట్టుంది పరిస్థితి.
Also Read: అప్పుడు నేను జస్ట్ ‘సిల్క్’.! విద్యాబాలన్‌ని కాను.!
ఇంత పెద్ద విజయంలో తానూ భాగస్వామ్యురాలినైనందుకు ఆనందంగా వుందని అమీషా పటేల్ (Ameesha Patel) చెబుతోంది.
మొత్తమ్మీద, ‘గదర్-2’ సినిమా సక్సెస్.. కొత్త ఈక్వేషన్స్‌కి తెరలేపేలానే వుంది. ఇదే ఊపులో, మరో సీక్వెల్‌కి కూడా ప్లాన్ చేస్తారేమో.!
ఇదిలా వుంటే, తెలుగులోనూ రీ-ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో వుందట అమీషా పటేల్ (Ameesha Patel).!