Ananya Nagalla Tantra Movie.. ‘మా సినిమాకి రండి’ అని ఎవరైనా చెబుతుంటారు.. అదే కదా పబ్లిసిటీ అంటే.! కానీ, ‘తంత్ర’ సినిమా టీమ్ మాత్రం, ‘మా సినిమాకి రావొద్దు’ అంటోంది.
ఇక్కడ రావొద్దు అంటే, చిన్న పిల్లలు రావొద్దని. ‘ఎ’ సర్టిఫికెంట్ వుంటే, ఎలాగూ థియేటర్లలోకి పిల్లల్ని రానివ్వడంలేదు ఈ మధ్య.
మరి, ‘పిల్ల బచ్చాలు రావొద్దు’ అని పోస్టర్లలో ‘తంత్ర’ టీమ్ పేర్కొనడమేంటి.? దీన్ని ఎలా చూడాలి.?
ప్రేక్షకుల్లో చిన్న పిల్లల్ని ‘తంత్ర’ టీమ్, ‘పిల్ల బచ్చాలు’గా అభివర్ణిస్తోందన్నమాట.! పోస్టర్ చూస్తే, భయం గొలిపేదిగానే వుంది.
Ananya Nagalla Tantra Movie.. దెయ్యాలు తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తా?
అనన్య నాగల్ల ఈ సినిమాలో నటిస్తోంది. దెయ్యాల సినిమాలు తెలుగు తెరకు కొత్త కాదు. పిల్లలూ ఈ మధ్య ఇలాంటి సినిమాలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే, సినిమాలో కంటెంట్ వుండాలి.! లేకపోతే, ఈ తరహా దెయ్యాల సినిమాలు మరీ దారుణంగా పేలిపోతుంటాయ్.

‘పిల్ల బచ్చాలు రావొద్దు’ అన్న ప్రస్తావనతో నిజంగానే పిల్లలు గుస్సా అవుతున్నారు. వాళ్ళ మనోభావాలూ దెబ్బ తింటున్నాయ్.! అంతేనా.? అంతేనేమో.!
వెరైటీగా ప్లాన్ చేశామని అనుకుంటున్నారుగానీ, ఇదొక దిక్కుమాలిన స్ట్రాటజీ. నిజానికి, దిగజారుడుతనంతో కూడిన పబ్లిసిటీ స్టంట్.
అలా ఎలా ‘పిల్ల బచ్చాలు’ అనేస్తారు.? ఎవరు ఐడియా ఇచ్చారోగానీ, బొత్తిగా బుర్రతక్కువ సన్నాసితనమే అది.!