Anasuya Bharadwaj Crying.. అయ్యయ్యో.! అనసూయ భరద్వాజ్ ఏడ్చింది.! ఏం, ఆమె మనిషి కాదా.? ఆమెకు బాధ రాదా.? ఎందుకు ఏడవకూడదు.!
ఇంతకీ, అనసూయ (Anasuya Bharadwaj) ఎందుకు ఏడ్చింది.? ఏమో, ఏమయ్యిందో.! సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
అంతే కాదు, అందులో ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది.! అందులో అనసూయ (Anasuya) గట్టిగా ఏడ్చేసింది. అది కూడా బోరున విలపించేయడం గమనార్హం.!
Anasuya Bharadwaj Crying.. ఓకే.. బట్ నాట్ ఓకే.!
ధైర్యంగా వుంటాను.. కౌంటర్ ఎటాక్స్ ఇస్తుంటాను.. నవ్వుతుంటాను.. ఇవే నేను కాదు.! నాలో ఇంకో కోణం కూడా వుంది. నేనూ బాధపడతాను. నేనూ సెన్సిటివ్‌గా వుంటాను.. అంటూ పేర్కొంది అనసూయ.
అంతేగా.! ఎవరైనా అలాగే వుంటారు కదా.! ‘నేనిప్పుడు బాగానే వున్నాను..’ అని చెబుతూనే, ‘ఓకే బట్ నాట్ ఓకే..’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా అనసూయ జత చేయడం గమనార్హం.

న్యూస్ రీడర్‌గా పనిచేసినప్పటినుంచి, జబర్దస్త్ యాంకర్‌గా.. వెండితెరపై నటిగా.. ఇలా అనసూయ, తన కెరీర్లో చాలా కస్టపడే పైకొచ్చిందన్నది నిర్వివాదాంశం.
వీటికి తోడు.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విషయంలో వివాదాలు.. ఆ పబ్లిసిటీ స్టంట్లు.. అది వేరే కథ మళ్ళీ.!
ఫొటో షూట్లు..
సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలు.. ఫొటో షూట్లు.. ఇంట్రెస్టింగ్ విషయాలు.. ఇరిటేట్ చేసే కామెంట్లు.. వాట్ నాట్.. అన్నిటినీ చూసింది.. అనసూయ చెయ్యాల్సింది చేసింది కూడా.!
ఎవరి పట్ల అయినా దయ చూపండి.. ట్రోలింగ్ తగ్గించండి.. అంటూ ఓ సందేశం లాంటిది కూడా అనసూయ (Anasuya Bharadwaj) ఇచ్చిందండోయ్.!
Also Read: అప్పట్లో నెమలి.! వైజాగ్ సన్నీలియోన్.! మరి.. ఇప్పుడేంటి.?
నిజమే, ట్రోలింగ్ అంటే సరదా కాదు.! ఒక్కోసారి, జీవితాల్ని నాశనం చేసేస్తుంది కూడా.!
అనసూయ ఇంత చెప్పినా.. ట్రోలింగ్ మాత్రం ఆగట్లేదు.! వీడియో కోసం ఏడ్చావా.? బాగా నటించావ్.. అంటూ అనసూయని ట్రోల్ చేస్తున్నారు.!