‘వేదం’ (Vedam) సినిమా కోసం అనుష్క (Anushka Shetty) వేశ్య పాత్రలో నటించిన విషయం విదితమే. నిజానికి అలాంటి పాత్రలు చేయాలంటే గట్స్ వుండాలి. తాను కేవలం గ్లామరస్ పాత్రలకి మాత్రమే పరిమితం కాదనీ, ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అయినా చేయగలనని నిరూపిస్తూ అనుష్క చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో ‘వేదం’ ఒకటి. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj In Spicy Project) కూడా అదే బాటలో నడుస్తోందా.? అంటే అవుననే గుసగుసలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) అంటే, బుల్లితెరపై ఓ సంచలనం. వెండితెరపై కూడా. ‘సూయ సూయ సూయ..’ అంటూ స్పెషల్ సాంగ్ చేసినా, ‘రంగమ్మత్త’గా (Rangammatha) ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాలో అద్భుతమైన పాత్రతో ఆకట్టుకున్నా, ‘క్షణం’ సినిమాలో మెరిసినా.. అనసూయ (Anasuya Bharadwaj In Spicy Project) రూటే సెపరేటు.
ఇక, ఇప్పుడు అనసూయ (Anasuya Bharadwaj Jabardast) వరుస సినిమాలతో బిజీగా వుంది. వీటిల్లో రెండు తమిళ సినిమాలు కూడా వున్నాయి. తెలుగు సినిమాల విషయానికొస్తే, ‘థ్యాంక్యూ బ్రదర్’ (Thank You Brother) అనే సినిమాలో అనసూయ గర్భిణి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
రవితేజ హీరోగా తెరకెక్కున్న ‘ఖిలాడీ’ (Khiladi) సినిమాలోనూ ఆమె నటిస్తోంది. తాజాగా యంగ్ హీరో కార్తికేయ నటిస్తోన్న ‘చావు కబురు చల్లగా’ (Chaavu Kaburu Challaga) సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది అనసూయ.
ఓ ప్రముఖ హీరో నటిస్తోన్న ఓ ప్రతిష్టాత్మక సినిమాలో అనసూయకి (Anasuya Bharadwaj In Spicy Project) ‘వేశ్య’ పాత్ర ఆఫర్ చేశాడట ఓ ప్రముఖ దర్శకుడు. అయితే, ఈ విషయమై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
‘వేశ్య పాత్ర’ అనగానే, జుగుప్సాకరమైన రీతిలో వల్గారిటీ మాత్రమే వుంటుందనుకోవడానికి వీల్లేదు. ఛార్మి నటించిన ‘జ్యోతిలక్ష్మి’, శ్రియ నటించిన ‘పవిత్ర’ సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇంతకీ, అనసూయ.. ‘ఆ స్పెషల్ రోల్’ (Anasuya Bharadwaj In Spicy Project) చేస్తోందా.? ఏమో, వేచి చూడాల్సిందే.