అదొక సినిమా.. అందులో అనసూయ భరద్వాజ్ ఓ పాత్రధారి. సినిమాలో తన పాత్ర కోసం గర్భిణిలా నటిస్తోంది బుల్లితెర బ్యూటీ అనసూయ. ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. లిఫ్ట్‌లో అనసూయ (Anasuya Bharadwaj Thank You Brother) ఇరుక్కుపోయింది. సాంకేతిక సమస్య కారణంగా అందులో అనసూయ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
అనసూయతోపాటు అదే లిఫ్టులో ఇంకో వ్యక్తి కూడా వున్నాడు. గర్భిణి కావడంతో అనసూయ పాత్ర ప్రసవ వేదనతో తల్లడిల్లిపోతోంది. ఇదీ ప్రస్తుతానికి ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమా ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోన్న ఆ సినిమా కథాంశం. ట్రైలర్‌లో ఇంకా పలు అంశాలున్నాయి.
కానీ, ‘లిఫ్టులోనే ప్రసవ వేదనతో విలవిల్లాడిపోతున్న అనసూయ..’ అంటూ విపరీతమైన ట్రోలింగ్ వెబ్ మీడియానే చేసేస్తోంది. ఇదెక్కడి పైత్యం.? అని దీన్నంతా భరిస్తోన్న సగటు సినీ అభిమాని ముక్కున వేలేసుకుంటున్నాడు. నిజానికి, ఓ నటి తెరపై గర్భిణి పాత్రలో కనిపించడం కొత్తేమీ కాదు.
ప్రసవ వేదనతో విలవిల్లాడుతున్నట్లుగా సదరు నటిపై సన్నివేశాలు చిత్రీకరించడమూ కొత్త కాదు. అక్కడికేదో ఇదే తొలిసారి తెలుగు తెరపై జరుగుతున్న వ్యవహారంలా.. అత్యంత దారుణంగా, ‘దారుణం.. లిఫ్టులోనే అనసూయ పురిటి నొప్పులు..’ అంటూ హెడ్డింగులు పెట్టి మరీ ర్యాగింగ్ చేసేస్తున్నారు.
నెగెటివ్ పబ్లిసిటీనే అయినా.. సినిమాకి భలేగా కలిసొచ్చేస్తుంటుంది గనుక, మేకర్స్ ఈ ట్రైలర్ రివ్యూలను చూసి ఎంజాయ్ చేస్తుండొచ్చుగాక.
కానీ, అనసూయ ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్టుగా వ్యవహరిస్తుంటుంది. మహిళలకు సంబంధించి ఎక్కడ, ఏ చిన్న నెగెటివ్ కామెంట్ పడినా ఊరుకోదు. అలాంటిది, తన గురించి.. ‘థాంక్యూ బ్రదర్’ (Anasuya Bharadwaj Thank You Brother) సినిమా గురించి ఇలాంటి ‘దారుణమైన’ రాతలు రాస్తున్నవారిపై విరుచుకుపడకుండా వుంటుందా.? ఏమోగానీ, అనసూయ కారణంగా ఈ ట్రైలర్‌కి విపరీతమైన వ్యూస్ అండ్ లైక్స్ వచ్చి పడుతున్నాయి.