Anasuya Bharadwaj Jabardast.. క్రికెట్టు అన్నాక రిటైర్మెంటు తప్పదు.! సినిమా హీరోయిన్లకీ అంతే. నేటి హీరోయిన్లే, రేపటి క్యారెక్టర్ ఆర్టిస్టులు.!
అనసూయ భరద్వాజ్ అలియాస్ జబర్దస్త్ అనసూయ.! అంతకు ముందు ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ఓ ఎంటర్టైన్మెంట్ (మ్యూజిక్) ఛానల్ యాంకర్ కూడా. జబర్దస్త్ షో ఆమె దశ మార్చేసింది.
ఒకానొక సమయంలో అనసూయ జబర్దస్త్‌ని వదిలేసినా, కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చి చేరింది. అనసూయ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే అనసూయ.! ఔను, అలా నడిచింది కథ.
Anasuya Bharadwaj Jabardast.. అనసూయ.. అందం మాత్రమే కాదు.!
కేవలం అందాల ప్రదర్శనతోనే జబర్దస్త్ యాంకర్‌గా ఆమె పాపులర్ అయ్యిందనుకుంటే పొరపాటే. అంతకు మించిన ఎట్రాక్షన్ ఆమెను ఆ షోకి హైలైట్‌గా మార్చేసింది.
ఓ వైపు రష్మి, ఇంకో వైపు అనసూయ.. వెరసి జబర్దస్త్ అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్‌కి తమదైన గ్లామర్ అద్దారు.

ఇప్పుడు అనసూయ, శాశ్వతంగా జబర్దస్త్‌కి దూరమైపోయిందట. ఇదో పెద్ద సంచలన వార్త. దేశం బద్ధలైపోయేంత పెద్ద వార్తగా మారిపోయిందిది.! ఇప్పుడంటే అనసూయ, రష్మి గౌతమ్ అంటున్నాం.!
కానీ, ఒకప్పుడు ఉదయ భాను లాంటోళ్ళు బుల్లితెర మహరాణులుగా ఓ వెలుగు వెలిగారు. ఉదయభానుకి అప్పట్లో వున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆమెకు అభిమానులున్నారు.
అప్పట్లో ఉదయభాను.. ఆ తర్వాత అనసూయ.!
ఉదయభానులా, అనసూయలా.. సుమ కనకాల ఎప్పుడూ ఎక్స్పోజింగ్ చేసింది లేదు. కానీ, యాంకరింగ్ అంటే సుమ తర్వాతే ఎవరైనా.!
సుమతో, ఉదయభాను అలాగే అనసూయ, రష్మిలను పోల్చడం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ.

అనసూయ (Anasuya Bharadwaj) విషయానికొస్తే, ఆమె ఎప్పుడో జబర్దస్త్ నుంచి ఔట్ అయిపోవాల్సింది. కానీ, వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి, మళ్ళీ వచ్చింది.
Also Read: సుప్రీం హీరో ఈజ్ బ్యాక్.! తేజూపై ఇంకేమన్నా డౌట్లున్నాయా.?
అనసూయ కాకపోతే ఇంకొకరు.. ఎవరో ఒకరు రావాలి కదా, వస్తూనే వుంటారు. ఇదొక ప్రవాహం అంతే.! పాత నీరు పోయి, కొత్త నీరు వస్తుంది మరి.!
నిజానికి, అనసూయ సినిమాల్లో బిజీ అయిపోయింది.. సో, బుల్లితెరపై కొనసాగడం కష్టం. దానికి తోడు, అనసూయ గ్లామర్ కూడా వెండితెరపై బోర్ కొట్టేసిందన్న భావన చాలామందిలో లేకపోలేదు.