Anasuya Bharadwaj Liger Vijay.. తగ్గేదే లే.. అన్నట్టుగా వుంది అనసూయ భరద్వాజ్ వ్యవహారం.! విజయ్ దేవరకొండ మీద ఆమె మంట ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు.!
స్వయంగా ఆమే చెబుతోంది, వదిలే ప్రసక్తే లేదని.! అనసూయ ఆరాటం తప్ప, అక్కడ విజయ్ దేవరకొండ ఆమెను అస్సలు పట్టించుకోవడంలేదు.
‘నేను మాట్లాడింది రైటు.. అతను మాట్లాడింది బూతు..’ అనే అంటోంది అనసూయ.! నిజమే, విజయ్ దేవరకొండ మాట్లాడింది బూతు.! దాన్ని ఖండించడం అనసూయ రైటూ.! ఎవరు కాదన్నారని.?
Anasuya Bharadwaj Liger Vijay పాత కథ.! తవ్వి తీయడమెందుకు దండగ.!
అది ముగిసిన అధ్యాయం.! దాన్ని ఎంత తవ్వుకున్నా ప్రయోజనం లేదు. ‘ఏనుగు వెళుతోంటే.. గ్రామ సింహాలు చాలానే మొరుగుతుంటాయ్..’ అన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు విజయ్ అభిమానులు.
ఇక్కడ ఏనుగు ఎవరు.? గ్రామ సింహాలు ఎవరు.? విజయ్ దేవరకొండని ఏనుగుగా.. అనసూయని గ్రామ సింహాలుగా కొందరు అభివర్ణిస్తున్నారు.

కాదు కాదు, అనసూయే ఏనుగు.. ఆమెని చూసి మొరుగుతున్నాయ్ అభిమానం ముసుగులో విజయ్ దేవరకొండ అభిమాన సైన్యం.. అన్నది ఇంకో వాదన.
ఎవరి గోల వారిది.! అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ అభిమానులు.. ఇదీ ఇప్పుడు జరుగుతున్న రచ్చ.!
ఖాళీ ఎక్కువైపోయి.. ఎందుకీ పంచాయితీ.?
విజయ్ దేవరకొండ.. తన సినిమాలతో తాను బిజీగా వున్నాడు. ఇలాంటి చిల్లర పంచాయితీల గురించి ఆలోచించే మూడ్‌లో లేడాయన.. అన్నది జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది.
Also Read: Sakshi Vaidya.. ‘ఏజెంట్’ భామ తెలుగు పలుకులు అప్పుడేనా.!
మరి, అనసూయ ఖాళీగా వుందా.? అంటే, ఏమో.. అంతేనేమో.. అందుకే, సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తోందేమో కూడా.!
ఛాన్సే లేదు.. అనసూయ కూడా బిజీగానే వుంది.! బిజీగా వుంటే, ఎందుకీ లొల్లి.? ఎప్పటికైనా విజయ్ దేవరకొండ స్పందించకపోతాడా.? అని అనసూయ ఎదురుచూస్తోందంతే.!
ఒకవేళ విజయ్ దేవరకొండ స్పందిస్తే.. అది చాలా చాలా ఘాటుగా వుంటుంది. ఆ తర్వాత మళ్ళీ అనసూయ, తనదైన స్టయిల్లో సింపతీ గేమ్స్ షురూ చేస్తుందేమో.!