Table of Contents
Anasuya Bharadwaj.. నవస్త్ర.! దీనర్థమేంటి.? ఆ అర్థం తర్వాత తెలుసుకుందాం. ముందైతే, బుల్లితెర బ్యూటీ, వెండితెర ‘రంగమ్మత్త’ అనసూయ భరద్వాజ్, ‘నవస్త్ర’ పేరుతో హంగామా చేస్తోంది.
డిజైనర్ గౌరీ నాయుడుతో కలిసి ఈ ‘నవస్త్ర’ షురూ చేసింది అనసూయ. విజయదశమి నేపథ్యంలో నవరాత్రులను పురస్కరించుకుని, ఇదేదో కొత్తగా డిజైన్ చేసినట్టున్నారు.
అనసూయ అంటేనే గ్లామర్.! అందుకే, ఇంట్రోలోనే అవసరం వున్నా, లేకున్నా పొట్టి దుస్తులతో గ్లామర్ చూపే ప్రయత్నమైతే చేసిందామె.
Anasuya Bharadwaj ఆమె డ్రస్సు.. ఆమె ఇష్టం.!
ఇద్దరు పిల్లల తల్లివి కదా.? ఇదేం పైత్యం.? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఆమెకు కొత్త కాదు. ఆమె డ్రస్సు.. ఆమె ఇష్టం. ఆమెకేది కంఫర్ట్‌గా వుంటే, అదే ధరిస్తుంది.!
అలాగే, ఎవరి కామెంట్లు వాళ్ళ ఇస్టం. నచ్చినట్లు కామెంట్ చేస్తారు. కాకపోతే, అప్పుడప్పుడూ అనసూయకి కోపమొస్తుంటుంది.. పోలీసులు, కేసులు.. అంటూ ఆమె హంగామా చేయడం మామూలే.
ఇంతకీ ‘నవస్త్ర’ అంటే ఏంటి.?
వనస్త్ర అర్థం గురించి నెటిజనం గూగుల్ తల్లిని అడిగితే, ‘న.. వస్త్ర’ అని తేలింది. దానర్థం, వస్త్రం లేకపోవడమని.! వామ్మో, ఇదేం పదం.? ఇదింతే.!

ఎప్పుడన్నా పండితులు చదివే మంత్రాలు వింటే, ‘న’ తాలూకు ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది.
‘కామాతురాణాం న భయం న లజ్జ..’ అంటుంటాం కదా.! కామంతో కళ్ళు మూసుకుపోయేవాడికి భయం వుండదు, లజ్జ కూడా వుండదని అర్థం.
ఇప్పుడర్థమయ్యింది కదా, ‘నవస్త్ర’ అంటే.! వస్త్రం లేకపోవడం.. అని పేరు పెట్టుకుని, డిజైనర్ వస్త్రాల గురించి మాట్లాడటమేంటి.?
నేతి బీరకాయలో నెయ్యి.. నవస్త్రలో వస్త్రం.. రెండూ ఒకటే.!
సభ్యత సంస్కారం లేని వస్త్రాలు ధరించి, సభ్యతతో కూడిన కామెంట్లను ఆశించినట్లే.. ఈ నవస్త్రలోని వస్త్రం కూడా.. అని నెటిజనం సెటైర్లేస్తున్నారు.
Also Read: సమంతకి మళ్ళీ ఏమైంది.? ఎందుకింత ఆందోళన.?
మరీ అన్నిటికీ అర్థాలు వెతుక్కుంటూ పోతే, పేర్లు పెట్టుకోవడం కష్టం.. అంటారా.? తెలుగుకెప్పుడో తెలుగు పట్టించేశారు.. టెల్గుగా మార్చేశారు. సో, అర్థాలు వెతకడం అనవసరం.!
కానీ, భాషాభిమానులుంటారు కదా.? ‘మీకిందేం పోయేకాలం.?’ అంటూ నిష్టూరమాడకుండా వుండలేరు మరి.!

చివరగా.. బట్టల్లేకపోతే వివస్త్ర అంటాం.. సో, నవస్త్ర అంటే బట్టల్లేకపోవడం కాదని బుకాయిస్తే, ఇంకేమంటాం.?