Anasuya Bharadwaj Sunflower.. అనసూయా భరద్వాజ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదో ట్రెండింగే. క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. తాజాగా కొన్ని అందాల ఫోటోలు పోస్ట్ చేసింది అనసూయ.
పొద్దు తిరుగుడు పూల తోటలో అరవిరిసిన నవ్వులతో అందంగా మెరిసిపోతున్న ఈ ఫోటోలకు నెటిజనం ఫిదా అయిపోతున్నారు.
అవును నిజమే, అనసూయ ఫోటో సెషన్స్‌లో బెస్ట్ ఎవర్ పోజులనే చెప్పొచ్చేమో. సీ గ్రీన్ కలర్ శారీలో మ్యాచింగ్ జ్యుయలరీతో అనసూయ నిజంగానే అందంగా కనిపిస్తోంది.
Anasuya Bharadwaj Sunflower.. పూలకే అసూయ పుట్టేంత అందం.!
ఆంటీలకు.. కాదు కాదు, అమ్మాయిలకే అసూయ పుట్టే అందం అనసూయ సొంతం. అదేంటో, వయసు పెరుగుతుందో, తగ్గుతుందో అస్సలు అర్ధం కాదు అనసూయ విషయంలో.

ఈ తాజా పోజులకు ఆ అనుమానం మరింత రెట్టింపవుతోందంటే అతిశయోక్తి కాదేమో. అందుకే, ఆ పొద్దు తిరుగుడు పూలే అనసూయ అందానికి ఆకర్షితులవుతున్నట్టున్నాయ్.
పొద్దు తిరుగుడు పువ్వులన్నీ.. అనసూయ వైపు తలలు తిప్పి చూస్తున్నాయ్. అనసూయ అందంతో, ఈ పొద్దు తిరుగుడు పూలు పోటీ పడుతున్నట్లున్నాయ్.
Mudra369
వాటితో రొమాన్స్ చేస్తున్నా.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ ఫోటోలకి అనసూయా భరద్వాజ్. కాదు కాదు, అనసూయతోనే ఆ పూలు రొమాన్స్ చేస్తున్నట్లున్నాయ్.
వెండితెరపై అనసూయ బిజీ బిజీ..
సూర్యుడు ఎటు తిరిగితే అటువైపు తమ తలలను వాల్చే ఈ పూలు, ఇప్పుడు అనసూయ వైపు తలలు వాల్చి చూస్తున్నాయ్. అనసూయ అందంతో, ఈ పొద్దు తిరుగుడు పూలు పోటీ పడుతున్నట్లున్నాయ్.
Also Read: Swara Bhaskar: పెళ్ళైన నెల రోజులకి..!
ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే, యాంకరింగ్ స్టేజ్ నుంచి వెండితెరపై వెలుగుల వరకూ వచ్చేసింది. సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల బుల్లితెరపై కనిపించడం బొత్తిగా తగ్గించేసింది అనసూయ.

ప్రస్తుతం బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులు అనసూయ చేతిలో వున్నాయ్. అప్పుడప్పుడూ కొన్ని టీవీ షోలలోనూ తళుక్కున మెరుస్తోంది అనసూయ.