Anasuya Bharadwaj Trolling.. ప్రేమికుల రోజున.. తన భర్తతో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడమే అనసూయ చేసిన పెద్ద తప్పు అనుకోవాలా.?
కాదేదీ ట్రోలింగ్‌కి అనర్హం.! ఔను, అనసూయ పోస్ట్ చేసిన ఫొటో మీద ట్రోలింగ్ షురూ అయ్యింది. ఓ నెటిజన్ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
అంతేనా, ‘మా ఇంట్లో పనిమనిషి పోస్ట్ ఖాళీగా వుంది.. బయోడేటా పంపిస్తే, పరిశీలిస్తాను..’ అంటూ కామెంటేశాడు ఓ నెటిజన్.
Anasuya Bharadwaj Trolling.. అనసూయ రెచ్చిపోయిందంతే..
మాటకు మాట.. అనసూయ వర్సెస్ ఆ నెటిజన్.. పెద్ద రచ్చే జరిగింది. ‘అరేయ్..’ దాకా వెళ్ళిపోయింది అనసూయ కౌంటర్ ఎటాక్. అట్నుంచి కూడా అంతే స్థాయిలో రిటార్టులు వచ్చిపడ్డాయ్.

‘అంతేలే.. మంచిగా మాట్లాడేవాళ్ళ కామెంట్లకు ఎందుకు స్పందిస్తావ్.? నిన్న ట్రోలింగ్ చేసేవాళ్ళకే స్పందిస్తావ్..’ అంటూ అనసూయపై ఆమె అభిమానులూ నొచ్చుకుంటున్నారు.
ఆమెకి ఇదేం కొత్త కాదు..
నిజానికి, అనసూయకి ఇదేమీ కొత్త కాదు. అనసూయని ట్రోలింగ్ చేయడం ద్వారా కొందరు నెటిజన్లు పొందే పైశాచికానందమూ కొత్త కాదు.
ఎవరి గోల వారిదే.! ఈ ట్రోలింగ్ పుణ్యమాని ఆయా వ్యక్తులకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చి పడుతోంది.
Also Read: ఫాఫం నయనతార.! అజిత్ మీద అసహనంతో రగిలిపోతోందిట.!
కామెడీ కాకపోతే, ఇంట్లో పనిమనిషిగా చేరాల్సిన ఖర్మ అనసూయకేంటి.? లక్షల్లో పారితోషికం తీసుకుంటోంది అనసూయ సినీ రంగంలో.
అన్నట్టు, పనితనం నచ్చితే.. ఎంతైనా ‘పే’ చేస్తానంటున్నాడు ఆ నెటిజన్. మొత్తమ్మీద, వాలెంటైన్స్ డే భలేగా గిట్టుబాటైనట్టుంది.. సదరు నెటిజన్‌కి.