Anasuya Priyanka Publicity Stunt.. కాదేదీ, పబ్లిసిటీకి అనర్హం.! సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు ఎత్తుకుని డాన్సులు వేసేస్తుంటారు.! అదో సినిమాటిక్ రొమాంటిక్ టచ్ అంతే.!
ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అన్నట్టు, హీరోల్ని హీరోయిన్లు ఎత్తుకున్న సందర్భాల్నీ వెండితెరపై చూస్తుంటాం. అదే సినీ మ్యాజిక్కు.!
బుల్లితెరపైనా ఇలాంటివి కోకొల్లలు.! కాకపోతే, ఈ మధ్య పబ్లిసిటీ స్టంట్లు ఎక్కువైపోయాయ్.! ఆ మధ్య, ఓ బుల్లితెర కమెడియన్, ఓ బుల్లితెర నటిని స్టేజి మీద ఎత్తేసుకున్నాడు.
Anasuya Priyanka Publicity Stunt.. కంఫర్టబుల్ క్వశ్చన్..
అంతే, సదరు నటికి కోపమొచ్చేసింది. ‘నేను వేసుకున్న డ్రెస్ కంఫర్ట్‌గా లేదు. అది తెలుసుకోకుండా, ఇలా ఎలా చేస్తారు.?’ అంటూ ఏడ్చేసినంత పన్జేసింది.
దాంతో, షాకయ్యాడు ఆ కమెడియన్. ఇదంతా, పబ్లిసిటీ స్టంట్‌లో భాగమే.. అని, ఆ తర్వాత తెలిసింది. దిగజారుడుతనంలో వేరే లెవల్ అన్నమాట.!

పలు కామెడీ షోస్, స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో ఇలాంటి వేషాల్ని చాలానే చూస్తుంటాం. నటీనటులు, జడ్జిలు, సీరియస్ టోన్‌లో వాకౌట్ చేసినట్లు ప్రోమోల్ కట్ చేస్తుంటారు.
పెమినిస్టుల రచ్చ..
తాజాగా, మరో బుల్లితెర యాంకర్ (వెండితెరపైనా అవకాశాలు బానే దక్కించుకుంటోంది) విషయంలో ఇలాగే, ‘ఎత్తి కుదేసిన’ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఈ వ్యవహారం గురించి బోల్డంత రచ్చ జరుగుతోంది. అలా ఎలా చేస్తాడు వాడు.? అంటూ, సదరు బుల్లితెర నటుడి మీద గుస్సా అయిపోతున్నారు ‘పెమినిస్టులు’.!
Also Read: Tuk Tuk Telugu Review: ముగ్గురబ్బాయిలు, ‘ఓ దెయ్యం ప్రేమ కథ’.!
మొదటి వ్యవహారంలో బిగ్ బాస్ ఫేం ప్రియాంక జైన్ ఆ బుల్లితెర నటి కాగా, జబర్దస్త్ భాస్కర్ ఆ బుల్లితెర నటుడు. రెండో వ్యవహారంలో, అనసూయ భరద్వాజ్ – బిగ్ బాస్ ఫేం పృధ్వీ.. బాగా నటించారు.
ముందే చెప్పుకున్నాం కదా.. కాదేదీ పబ్లిసిటీ స్టంట్‌కి అనర్హం అని. అద్గదీ అసలు సంగతి.!
అనసూయ (Anasuya Bharadwaj), పృధ్వీ వ్యవహారంలో.. అనసూయ గోల చేసిందేమీ లేదుగానీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.