Andhra Pradesh Hair Politics: పొరుగు రాష్ట్రాల్లో కరెంటు కష్టాల్లేవ్.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కష్టాల కారణంగా చీకటి అలముకుంటోంది.
ప్రభుత్వాసుపత్రుల్లో కరెంటు లేక, వైద్య చికిత్సలు సైతం మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్‌తో చేయాల్సిన దుస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోంది.
ఇంతకీ, ప్రభుత్వం ఏం చేస్తోంది.? ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు.? ‘నా వెంట్రుక కూడా పీకలేరు..’ అంటూ ప్రజల సాక్షిగా విపక్షాలకు సవాల్ విసురుతున్నారు.
విపక్షాలపై రాజకీయ విమర్శలు చేయడానికంటూ ఓ వేదిక వుంటుంది.
వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా, లక్షలాది కోట్లాది ప్రజలు టీవీ సెట్లలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న వైనాన్ని చూస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి ఎంత హుందాగా వ్యవహరించాలి.?
Andhra Pradesh Hair Politcs.. జుట్టు పీక్కోవాల్సిందే.!
వెంట్రుక పీకలేకపోవడమేంటి.? అసలు వెంట్రుకలు పీకడమేంటి.? సభ్య సమాజం హర్షిస్తుందా ఇలాంటి మాటల్ని.? పోనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులైనా ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా.?
ఏదో ఫ్రస్ట్రేషన్ అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో (Ys Jaganmohan Reddy) కనిపిస్తోంది.
మంత్రుల చేత రాజీనామా చేయించిన ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా.? కొత్తగా ఎవర్ని మంత్రులుగా తీసుకోవాలన్న అయోమయం అనుకోవాలా.? ఇవేవీ కాదు, రాష్ట్రంలో తాను అనుకున్న పనులు జరగడంలేదన్న అక్కసుతోనా.?
మిగతా విషయాలు తర్వాత.. అసలు ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని ఏమిటన్నది ముఖ్యమంత్రికైనా తెలుసో లేదో.!
Also Read: రామ రామ.! అపార్ధం చేసుకున్నాం కదమ్మా.!
ఇప్పటికిప్పుడు రాష్ట్రానికి కరెంటు అవసరం. పవర్ హాలీడేలు ప్రకటించిన ప్రభుత్వం, ముందు ఆ సంక్షోభం నుంచి బయటపడాలి.
రాష్ట్రానికి రాజధాని కావాలి.. ప్రత్యేక హోదా కావాలి.. ఇంకా చాలా చాలా కావాలి. అవన్నీ తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడేమో.. ‘నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు..’ అని విపక్షాల్ని ఉద్దేశించి విమర్శించడమా.?