Andhra Pradesh Airports.. మన నైపుణ్యాన్ని పెంచుకుంటే, ఆదాయం సంపాదించుకునే మార్గం కనిపిస్తుంది. ఆదాయం పెరిగితే, ఆర్ధికంగా వున్నత స్థితికి చేరుకుంటాం. ఆ తర్వాత పది మందికి సాయపడగలం. ఇది సర్వ సాధారణమైన ఈక్వేషన్.
ఒక రాష్ర్టం లేదా ఒక దేశం బాగుపడాలంటే అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధి కోసం అప్పు చేయాల్సి వస్తే తప్పదు.. చేయాల్సిందే. కానీ, అప్పు చేసి సంక్షేమ కూడు అంటే, తిన్న తిండి గుట్కాయస్వాహా అయిపోతుంది.
కొంప ముంచుతున్న ఓటు బ్యాంకు రాజకీయం.!
పొద్దున్న లేస్తే, మళ్లీ బతుకు పోరాటం తప్పదు. చేసిన అప్పు తీర్చడం ఎలా.? బతుకు బండిని నడపడం ఎలా.? ఈ చిన్న ఈక్వేషన్ ఎందుకో అధికారంలో వున్న కొందరికి అర్ధం కావడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చూస్తే, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. అప్పుల్లో ముంచేస్తున్నారు.
గుంతల రోడ్లు బాగు చేయండి మహా ప్రభో.! అంటే వర్షాల పేరు చెప్పి తప్పించుకు తిరుగుతున్నారు. అదే సమయంలో జిల్లాకో ఎయిర్‌పోర్టు.. అంటున్నారు. ఒక్క రాజధాని సరిపోదు. మూడు రాజధానులు కావాలన్నారు. దేని కోసం ఇదంతా.? జనాన్ని వుద్ధరించడానికి అయితే కాదు. రాష్ర్టాన్ని నట్టేట్లో ముంచేయడానికే.
Andhra Pradesh Airports ‘అప్పు’డే తెల్లారిందా.?
నెలాఖరు వస్తోందంటే, ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి. అయినా గానీ, జిల్లాకో విమానాశ్రయం అట. ఆగండాగండి.. జిల్లాల సంఖ్య కూడా పెరిగింది. జిల్లాకొకటి చొప్పున 26 ఎయిర్ పోర్టులు కూడా ప్లాన్ చేసేశారేమో.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
26 ఏం సరిపోతాయ్.. ఇంటికో విమానం ఇచ్చేస్తే.. జనాలు రోడ్ల మీద తిరగాల్సిన పనుండదు. సో, రోడ్లే వేయాల్సిన పనుండదు. అన్నట్లు విమానాలంటే, మళ్లీ రన్‌వేలు వుండాలి. దానికైనా రోడ్డే వేయాలి కదా.. అబ్బో.! రోడ్డెయ్యడం అంటే మా సెడ్డ సిరాకు.. మా రాజులోరికి. ఎలికాప్టర్ అయితే బాగుంటుందేమో.
ఎళ్లెహే.! మరీ ఇంత ఎటకారమా.! కాదు, ఇది ఎటకారం కానే కాదు. ఏడుపు, ఆవేదన.. నా రాష్ట్రానికి ఇంతటి దుర్ఘతి ఎందుకు పట్టిందా.? అని.