Andrea Jeremiah Shades Of Love.. ఆండ్రియా.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకయితే, ‘తడాఖా’ బ్యూటీగా పరిచయం.
అంతకు ముందే కార్తి మొదటి సినిమా ‘యుగానికి ఒక్కడు’ సినిమా (డబ్బింగ్)తో తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది.
మంచి నటి. డీసెంట్ అండ్ లేడీ బాస్ క్యారెక్టర్లకు ఇట్టే సూట్ అయిపోతుంది. సీరియస్ విలన్ క్యారెక్టర్లలోనూ చక్కగా ఒదిగిపోతుంది. లేటెస్ట్‌గా విక్టరీ వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ సినిమాలో నటించింది.
యాక్షన్ గాళ్ రోల్స్‌నే ఎక్కువగా ఎంచుకుంటుంది. ‘సైంధవ్’లో పోషించిన జాస్మిన్ పాత్ర కూడా ఆ తరహాలోనిదే. తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ నటించింది ఆండ్రియా.
Andrea Jeremiah Shades Of Love.. అందగత్తే కాదు, పాట గత్తె కూడా.!
అయితే, మాతృభాష అయిన తమిళ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. నటిగానే కాదు, ఆండియా సింగర్‌గానూ, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ బిజీగా గడుపుతుంటుంది.
ఇలియానా, అమీజాక్సన్, కమలినీ ముఖర్జీ, తాప్సీ పన్ను వంటి ముద్దుగుమ్మలకెందరికో తన గొంతు అరువిచ్చింది ఆండ్రియా. అలాగే ఆయా భాషల్లో పలు సూపర్ హిట్ సాంగ్స్‌తో ఆకట్టుకుంది.

యువన్ శంకర్ రాజా, అనిరుధ్ రవిచంద్రన్, హారిస్ జై రాజ్ వంటి మ్యూజిక్ డైరెక్టర్ల కంపోజింగ్‌లో పలు వినసొంపైన పాటలు ఆలపించింది. తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లోనూ ఆండ్రియా కొన్ని పాటలు పాడింది.
అసలు మ్యాటర్ ఏంటంటే, ‘షేడ్స్ ఆఫ్ లవ్’ అంటూ కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆండ్రియా.

ఈ ఫోటోలు చూడగానే ఆండ్రియా లవ్వు ముచ్చట ఠక్కున గుర్తొచ్చేస్తోందరికీ. అదేనండీ, కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో అమ్మడు పీకల్లోతు లవ్వాయణం సాగించిన ముచ్చట అప్పట్లో ట్రెండింగ్.
ఇప్పుడింకా అనిరుధ్‌తో ప్రేమ కొనసాగిస్తుందో లేదో తెలీదు కానీ, లవ్ షేడ్స్ (ప్రేమ నీడలు) అంటూ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ తాజా పోజులు నెెట్టింట ట్రెండ్ అవుతున్నాయ్.
Also Read: అర్థం.. అపార్థం.! సిద్దార్ధ ‘నోటి దురుసు’తనం.!
ఏది ఏమైతేనేం, ప్రేమతో పాటూ, కెరీర్‌ని కూడా అందంగా డిజైన్ చేసుకుంటూ సకల వల్లభరాణిగా చెలామణీ అవుతోంది ఆండ్రియా. అందుకు హ్యాట్సాప్ అనాల్సిందే ఈ అందాల భామకు.!