Andrew Symonds Cricket.. సైమో.! ప్రపంచ క్రికెట్లో చాలా మంది లెజెండరీ క్రికెటర్స్ వున్నారు. క్రికెట్‌కి వన్నె తెచ్చిన ఆటగాళ్లే కాదు.. జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌ని భ్రష్టు పట్టించిన మేటి క్రికెటర్లు కూడా వున్నారు.
రెండో లిస్టులో ఆండ్రూ సైమండ్స్ అనే ఆస్ర్టేలియన్ స్టార్ క్రికెటర్ పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది. ప్రపంచ మేటి క్రికెట్ ఆల్ రౌండర్లలో సైమండ్స్ ఒకడు.
అలాగే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న క్రికెటర్లలో ఆయనా వుంటాడు.
దురదృష్టవశాత్తూ, రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలు కోల్పోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది.
Andrew Symonds Cricket.. లెజెండ్, కండిషన్స్ అప్లయ్.!
క్రికెట్ ప్రపంచం తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. సైమండ్స్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి చాలా కాలమే అయ్యింది. కానీ, క్రికెట్ అభిమానులు అతన్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు.
బ్యాటింగ్ బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆండ్రూ సైమండ్స్ మేటి ఆటగాడు. కాకపోతే, నోటి దూల ఎక్కువ. మామూలు ఎక్కువ కాదు. చాలా చాలా ఎక్కువ.

భారత క్రికెటర్ హర్బజన్ సింగ్ తనను మైదానంలో ధూషించాడంటూ రచ్చ చేసి, చివాట్లు తిన్నాడు. మైదానంలో వున్నాడంటే, నోటి దూలతో చెలరేగిపోతాడు.
థాంక్యూ లెజెండ్.!
ప్రత్యర్ధి ఆటగాళ్లపై ధూషణలకు దిగుతాడు. క్రికెట్ ఆడటం వదలేసి కామెంటేటర్ అయ్యాక మరింతగా నోటి దూలతో చెలరేగిపోయాడు. ఈ సారి ఆస్ర్టేలియా క్రికెటర్ల మీదే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు.
నిజానికి ఆండ్రూ సైమండ్స్ చాలా చాలా మంచోడు. యువ క్రికెటర్లను ప్రోత్సహించాడు. సేవా కార్యక్రమాలు చేశాడు. ప్రపంచ క్రికెట్లో మంచి టెక్నిక్స్‌తో తాను ఎదిగి, తనదైన టెక్నిక్‌ని క్రికెట్‌కి వారసత్వంగా అందించాడు.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
పోయినోళ్లందరూ మంచోళ్లే. కానీ, మంచి, చెడులు రెండూ మాట్లాడుకోవాలి. ఎలా వుండాలి.? ఎలా వుండకూడదు.? ఈ రెండింటినీ యువ క్రికెటర్లు ఆండ్రూ సైమండ్స్ జీవితాన్ని చూసి నేర్చుకోవాలి కదా మరి.
థాంక్యూ లెజెండ్.. సారీ లెజెండ్.. ఇలా తలచుకుంటున్నందుకు.