ర్యాపర్ నోయెల్ సీన్, బిగ్‌బాస్ (Captain Noel Sean Bigg Boss Telugu 4) హౌస్‌లో తన సామర్థ్యానికి తగ్గట్టుగా ‘గేమ్’ ఆడటంలేదన్న విమర్శలున్నాయి. నిజానికి నోయెల్ చాలా చాలా ఎనర్జిటిక్. అయితే, డౌన్ ప్లే చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నోయెల్ ఏదన్నా విషయాన్ని మాట్లాడుతోంటే, అది ఇంకోలా అవతలి వ్యక్తికి కన్వే అవుతోంది.
ఈ క్రమంలో చిన్న చిన్న అపార్ధాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకేనేమో.. తన సహజసిద్ధమైన ఎనర్జీని ప్రదర్శించకుండా, ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ‘ఓవర్ థింకింగ్’ అనే స్టాంప్ ఆల్రెడీ నోయెల్ మీద బిగ్‌బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున వేసేసిన విషయం విదితమే.
ఇదిలా వుంటే, నోయెల్ ఈ సీజన్లో రెండో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. లాస్య నుంచి కెప్టెన్సీ నోయెల్‌కి వచ్చింది. అయితే, చిత్రంగా కెప్టెన్ ఎంపిక కోసం ఎలాంటి ‘టాస్క్’ పెట్టలేదు బిగ్‌బాస్. హౌస్మేట్స్ అంతా కలిసి ఎంపిక చేయాలంటూ ఆదేశించేసరికి, కెప్టెన్ లాస్య నాలుగు పేర్లు చెప్పింది.
అందులోంచి, అనూహ్యంగా ‘దేవి’ ఔట్ అయిపోవడం, కరాటే కళ్యాణి ఇన్ అవడం జరిగిపోయాయి. అభిజిత్, తనకు కెప్టెన్సీ తీసుకోవడానికి ఇంకా సమయం వుందన్నాడు. సేమ్ టు సేమ్ అలాంటి రీజనే మెహబూబ్ దిల్ సే కూడా ఇచ్చేశాడు. దాంతో, దాదాపుగా వార్ వన్‌సైడ్ అయిపోయింది.
కెప్టెన్‌గా నోయెల్ని ఎంపిక చేసే సమయంలో ఓ టాస్క్ ఏదైనా పెట్టి వుంటే బావుండేదేమో. నో డౌట్ హౌస్‌లో నోయెల్ ర్యాప్ సాంగ్స్‌తో అదరగొట్టేస్తున్నాడు. కానీ, అంతకు మించి పెర్ఫామ్ చేయగల సత్తా నోయెల్‌కి వుంది.
కాగా, బిగ్‌బాస్ తనకు క్షమాపణ చెప్పాలంటే నోయెల్ ఓ సందర్భంలో ఆవేశానికి లోనయ్యాడు. హౌస్‌లో వుండబోననీ, నాగార్జున సార్‌ని అడిగి బయటకు వెళ్ళిపోతాననీ అన్నాడు నోయెల్.
కానీ, ఇలాంటి సీన్ గత సీజన్లో కూడా జరిగింది. అంటే, ఇది పూర్తిగా స్క్రిప్టెడ్ వ్యవహారమేనని అనుకోవాలేమో. నాగ్ ఎలాగూ ఈ విషయమై నోయెల్‌కి రేపు క్లాస్ పీకేయడం ఖాయమే.