Home » పవన్ కళ్యాణ్ సతీమణికి కూడా చిరంజీవి అంటే, అన్నయ్యే.!

పవన్ కళ్యాణ్ సతీమణికి కూడా చిరంజీవి అంటే, అన్నయ్యే.!

by hellomudra
0 comments
Anna Konidala Pawan Kalyan

Anna Konidala Pawan Kalyan.. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ‘అన్నయ్యా’ అని పిలుచుకుంటుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.!

మరి, పవన్ కళ్యాన్ సతీమణి అన్నా లెజినెవా ఏమని పిలుస్తారు చిరంజీవిని.? ఆమె కూడా ‘అన్నయ్యా’ అనే పిలిచేవారట.!

అదేంటీ, పెద్ద బావగారు కదా.. చిరంజీవి అంటే, అన్నా లెజినెవాకి.!? చిన్న బావగారేమో, నాగబాబు.! కానీ, అన్నయ్య అంటే చిరంజీవి, చిన్న అన్నయ్య అంటే, నాగబాబు అట.!

ఈ విషయాన్ని స్వయంగా అన్నా లెజినెవా, సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా, అన్నా లెజినెవా సోషల్ మీడియా హ్యాండిల్ తెరిచారు.

‘అన్నా కొణిదల’ పేరుతో, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన అన్నా లెజినెవా, చాలా తక్కువ సమయంలోనే లక్షలాది ఫాలోవర్స్ తెచ్చుకున్నారు.

Anna Konidala Pawan Kalyan.. మెగా కాంపౌండ్ ఘన స్వాగతం..

అన్నా లెజినెవాకి సోషల్ మీడియాలోకి వెల్‌కమ్ చెబుతూ, మెగా కాంపౌండ్ నుంచి పలువురు ప్రముఖులు స్పందించడం గమనార్హం. మెగాభిమానుల సంగతి సరే సరి.

చిరంజీవి కూడా, అన్నా లెజినెవాకి స్వాగతం పలికారు.. సోషల్ మీడియాలోకి. ఈ సందర్భంగా, చిరంజీవికి థ్యాంక్స్ చెబుతూ, ‘అన్నయ్యా’ అంటూ, స్టోరీ పెట్టారామె.

Anna Konidala Pawan Kalyan Chiranjeevi
Anna Konidala Pawan Kalyan Chiranjeevi

అదేంటీ, అన్నయ్య అనకూడదు.. బావగారూ.. అని పిలవాలంటూ, కొందరు సోషల్ మీడియా వేదికగా అన్నా లెజినెవాకి సూచించారు.

దాంతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినెవా వివరణ ఇవ్వక తప్పలేదు.

పదిహేనేళ్ళ క్రితం మెగా కుటుంబంలోకి వచ్చినప్పుడు, తనకు అస్సలు తెలుగు రాదనీ, పవన్ కళ్యాణ్ ఎవరెవర్ని ఎలా పిలుస్తారో, అలాగే తానూ పిలవడం నేర్చుకున్నానని చెప్పారు అన్నా లెజినెవా.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సమీక్ష: ఇచ్చిపడేసి.. ఇరగదీసేసిన పవర్ స్టార్.!

తనకు సోదరులు లేరనీ, ఆ ఆప్యాతానురాగాలు మెగా కుటుంబంలోకి వచ్చాకనే చూశానని చెప్పారామె. క్యూట్ అండ్ లవ్లీ ఫొటో కూడా ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు.

కొణిదెల అన్నా లెజినెవా షేర్ చేసిన ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా వున్నారు.

అందుకే అన్నయ్య అంటే చిరంజీవి, చిన్న అన్నయ్య అంటే నాగబాబు అని తనకూ అలవాటైపోయిందని అన్నారు కొణిదల అన్నా లెజినెవా.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group