Anna Konidala Tirumala.. అనా కొణిదల.. ఎవరో తెలుసు కదా.? ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి.!
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వుండటంతో, ఆయన సతీమని అనా కొణిదల కూడా రాజకీయంగా చాలా చాలా విమర్శల్ని ఎదుర్కొన్నారు.
ఆమె ఏనాడూ రాజకీయాల్లో లేరు. కానీ, ఆమె పేరుని రాజకీయాల్లోకి కొందరు లాగారు. అత్యంత దారుణమైన రీతిలో దుర్భాషలాడారు.
Anna Konidala Tirumala.. రష్యన్ మహిళ.. పైగా క్రైస్తవురాలు.. అయినాగానీ..
రష్యన్ మహిళ అయిన అనా కొణిదల మీద, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు చేసిన జుగుప్సాకరమైన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
కానీ, ఆ అనా కొణిదెలను ఇప్పుడు వాళ్ళంతా ప్రశంసిస్తున్నారు. కారణం, ఆమె తాజాగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించడమే.

జన్మతః క్రైస్తవ మతస్తురాలైన అనా కొణిదల, గతంలోనూ పలు దేవాలయాల్ని సందర్శించారు. కానీ, ఈసారి ఆమె తిరుమలను సందర్శించడం వెరీ వెరీ స్పెషల్.
ఇటీవల సింగపూర్‌లో అనా – పవన్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్, అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు.
పూర్తిగా తల నీలాలు అర్పించిన అనా కొణిదెల
ఆ ప్రమాదం నుంచి మార్క్ శంకర్, కోలుకోగానే.. అనా కొణిదెల, ఇండియాకి వచ్చి.. తిరుపతికి వెళ్ళి, తిరుమలలో తలనీలాలు అర్పించారు.
సాధారణ హిందూ మహిళలు కూడా, తలనీలాలు అంటే, మూడు కత్తెర్లు ఇస్తుంటారు. అంటే, జుట్టులో చాలా తక్కువ భాగం ఇస్తుండడం అందరికీ తెలిసిన విషయమే.

కానీ, క్రైస్తవ మతస్తురాలైన అనా కొణిదల, పూర్తిగా తలనీలాల్ని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్పించడం చాలా చాలా గొప్ప విషయం.
Also Read: సనాతనంపై విషం: పాత్రికేయ వనంలో గంజాయి మొక్కలు.!
అంతకు ముందు, టీటీడీ నిబంధనల ప్రకారం, అన్యమతస్తురాలైన అనా కొణిదెల, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు భక్తి, విశ్వాసం వున్నాయంటూ సంబంధిత డిక్లరేషన్‌పై సంతకం చేశారు.
తల్లిగా ఎంత తల్లడిల్లి వుంటే, తన కుమారుడి ప్రాణాల్ని ఆ వెంకటేశ్వర స్వామే కాపాడారన్న నమ్మకం ఎంత బలంగా వుంటే, ఆమె తలనీలాలు ఇచ్చి వుంటారు?