Table of Contents
Pawan Kalyan Dressing Controversy.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే, ‘స్వాగ్’.! ఆయన వస్త్ర ధారణ, ఆయన బాడీ లాంగ్వేజ్.. వాట్ నాట్! అందుకే, పవర్ స్టార్ అయ్యారు పవన్ కళ్యాణ్.!
జన సేన పార్టీ అధినేతగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతల్లోనూ ఆయన నిమగ్నమై వున్నారు.
ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాలు.. రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు జన సేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Dressing Controversy.. వస్త్ర ధారణ పట్ల అంత అసహనమెందుకు.?
ఇటీవల పవన్ కళ్యాణ్ తన వద్ద పని చేసే ఓ హెయిర్ స్టైలిస్ట్‌కి చెందిన సెలూన్‌ని విజయవాడలో ప్రారంభించారు.
సెలూన్‌కి వెళ్ళే క్రమంలో టీ షర్ట్, షార్ట్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్. అంతే, కొందరికి అమాంతం గుండె పోటు వచ్చేసిది. కాదు కాదు, బాత్రూమ్‌లోకి వెళ్ళి, గొడ్డలితో గుండె పోటు తెచ్చేసుకున్నారు.

లేకపోతే, పవన్ కళ్యాణ్ వస్త్ర ధారణ మీద పడి ఏడవడమేంటి.? పుంఖాను పుంఖాలుగా నెగెటివిటీతో కూడిన కథనాల్ని వండి వడ్డించడమేంటి.?
సోషల్ మీడియా వేదికగా, పవన్ కళ్యాణ్ మీద ఒకటే ట్రోలింగ్.! ఈ బ్యాచ్ ఎవరో తెలుసు కదా.? నీలి కూలీలు.!
పవన్ కళ్యాణ్ కాలి చెప్పుల కింద నలిగిపోతున్న జీవితాలవి..
కూలీ ఇచ్చి మరీ, ఈ తరహా నెగెటివిటీని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద, ఆయన రాజకీయ ప్రత్యర్థులు క్రియేట్ చేస్తున్నారు.
అక్కడి సందర్భమేంటి.? ఆ పరిస్థితి ఏంటి.? అన్న విషయాల్ని పక్కన పడేసి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి.. టీ-షర్ట్ వేసుకోకూడదు, షార్ట్ వేసుకోకూడదంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు.

సనాతన ధర్మ పరిరక్షకుడిగా, సంప్రదాయ వస్త్రాలు ధరిస్తే.. అదో తప్పు.! సినిమా హీరో కాబట్టి, ట్రెండీగా వ్యవహరిస్తే, అది మరో తప్పు.! ఇలా తగలడింది, సోకాల్డ్ మేతావుల బుర్ర.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వార్త లేకపోతే, పాఠకులెవరూ తమను పట్టించుకునే పరిస్థితే వుండదన్న భయంతో, వార్తల్లో ఆయన పట్ల తమ ద్వేషాన్ని చాటుకునేవాళ్ళు కోకొల్లలు.
ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్..
ఎవరో ఏదో అనుకుంటారని, తన స్టైలింగ్ మార్చుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఎలా వుండాలో ఆయనకు బాగా తెలుసు.! డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో, ఓ ట్రెండ్ సెట్ చేశారాయన.
Also Read: విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాల్సిందేనా.?
రాజకీయాలైనా, సినిమాలైనా.. పవన్ కళ్యాణ్ స్టైలింగ్‌కి వీర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక, నెగెటివిటీ అంటారా.? అది, కొంతమందికి తిండి పెడుతోంది.
పనిగట్టుకుని దుష్ప్రచారం చేసేవాళ్ళ విషయానికొస్తే, నలుగురూ నవ్విపోదురుగాక వీళ్ళకేటి సిగ్గు.?