Table of Contents
అప్పుడెప్పుడో ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel).
‘మజ్ను’ సినిమాలో నేచరల్ స్టార్ నాని హీరోగా నటించాడు. సినిమా మంచి విజయాన్నే అందుకుంది కూడా.
రాజ్ తరుణ్ సరసన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అనే సినిమాలోనూ నటించింది అనూ ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత దశ తిరిగింది. స్టార్ హీరోల సరసన ఛాన్సులూ కొట్టేసింది.
నాగచైతన్య, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్.. ఇలా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిందిగానీ, ప్చ్.. ఒకదాన్ని మించి ఇంకోటి డిజాస్టర్స్ అయ్యాయ్.
Anu Emmanuel.. మాయం.. ప్రత్యక్షం.. మళ్ళీ మాయం.!
వస్తుంది.. పోతుందీ.. అంటూ ఓ ప్రకటనలో చెప్పినట్లు, అనూ ఇమ్మాన్యుయేల్ తెలుగు తెరపై కనిపిస్తుంటుంది.. అంతలోనే మాయమైపోతుంటుంది.! అదే ఆమెకు పెద్ద సమస్య.

పెద్ద బ్రేక్ తీసుకోవడం కొంతమంది నటీనటుల విషయంలో సర్వసాధారణమే కావొచ్చు. కానీ, అలాంటి ‘బ్రేకులు’ చాలానే వున్నాయ్ అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్‌లో.
పేరు మారిందేలా.?
ఆ మధ్య ‘ప్రేమ కాదంట’ అంటూ ఓ సినిమా టైటిల్ అనౌన్స్ అయ్యింది. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ప్రారంభమైన సినిమాకి ఆ టైటిల్ పెట్టారు.
కానీ, ఇప్పుడా సినిమా టైటిల్ మారిపోయింది. ‘ఊర్వశివో.. రాక్షసివో’ (Urvasivo Rakshasivo) అంటూ కొత్త పేరు పెట్టారు. పేరు మారితే ఫేటు మారుతుందా.?

చాన్నాళ్ళ క్రితం నితిన్ హీరోగా వచ్చిన ఓ సినిమా పేరు కూడా ఇలాగే మార్చారు. కానీ, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
అల్లు శిరీష్ పరిస్థితేంటి.?
అనూ ఇమ్మాన్యుయేల్ సంగతి సరే.! అల్లు శిరీష్ (Allu Sirish) సంగతేంటి.? ప్చ్.. హిట్టు కోసం కాదు, సినిమా రిలీజ్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు శిరీష్.!
Also Read: సిద్ శ్రీరామ్.! తెగులు పాటకి ‘నువ్వుళ్టే’ ఆ కిక్కే వేరప్పా.!
ఫాఫం.. అన్న అల్లు అర్జున్ (Allu Arjun) సపోర్ట్ అయినా ఈ ‘ఊర్వశివో రాక్షివో’ సినిమాకి దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.
అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చేసి డిజాస్టర్ కొట్టిన అనూ ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్‌కి కూడా అంతకు మించిన డిజాస్టర్ ఇచ్చేలానే వుంది.