Home » God Father డిజాస్టర్ కోసం వాళ్ళంతా వెయిటింగ్.!

God Father డిజాస్టర్ కోసం వాళ్ళంతా వెయిటింగ్.!

by Mudra369 Editorial Desk
0 comments
God Father Chiranjeevi

‘ఆచార్య’ సినిమాని దెబ్బ తీయడానికి పెద్ద మాఫియానే పని చేసింది. ‘గాడ్ ఫాదర్’ (God Father) మీద ఆ మాఫియా ఫోకస్ పెట్టింది.

పెద్దయెత్తున డబ్బు కుమ్మరించి, పెయిడ్ బ్యాచ్ ద్వారా సినిమాపై విపరీతమైన నెగెటివ్ టాక్‌ని సినిమా విడుదలకు ముందు నుంచే ప్రచారంలోకి తీసుకొచ్చేలా చేయగలిగారు.

ఎవరికి అంత కసి.? అంటే, ఈ మధ్య పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి మాఫియా ఒకటి ప్రతిసారీ కనిపిస్తుంటోంది. సినిమాలో దమ్ము వుంటే, ఇలాంటి పెయిడ్ ప్రచారాల ఎఫెక్ట్ చాలా తక్కువగా వుంటుంది.

God Father.. ఆ మాఫియాకి బలైపోతుందా.?

సినిమాలో విషయం లేకపోతే మాత్రం, వసూళ్ళను దారుణంగా దెబ్బతీస్తోంది ఈ పెయిడ్ మాఫియా తీరు. కొన్ని హిట్ సినిమాల్ని సైతం నిర్వీర్యం చేస్తోంది ఈ మాఫియా.

సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో వీడియో షూట్ చేసి, చిన్న చిన్న బిట్స్ కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వల్గర్ మీమ్స్ తయారు చేసి ప్రచారం చేయడం.. ఇవన్నీ ఆ మాఫియా ట్రిక్స్.

God Father Chiranjeevi
God Father Chiranjeevi

పైగా, ఈ మాఫియా ఒక్కోసారి ఒక్కో ముసుగేసుకొస్తోంది. రాాజకీయ పార్టీల రంగులేసుకుని కూడా సినీ పరిశ్రమని నాశనం చేస్తోంది.

మెగా అభిమానుల ముసుగు ఓ సారి, నందమూరి అభిమానుల పేరు చెప్పుకుని మరోసారి.. సూపర్ స్టార్ మహేష్ అభిమానుల ముసుగేసుకుని ఇంకోసారి, అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగేసుకుని.. ఇలా చెప్పుకుంటూ పోతే, కథ చాలా పెద్దదే.

ఎవరూ ఈ మాఫియాని తప్పించుకోలేరు.!

విజయ్ దేవరకొండ, నాని, రవితేజ.. వీళ్ళ అభిమానుల పేరుతో కొందరు చేస్తున్న యాగీ తక్కువేమీ కాదు. మరీ, ఊసరవెల్లుల్లా మారిపోతున్నారు ఈ మాఫియా గ్యాంగ్‌కి చెందిన పెయిడ్ ఆర్టిస్టులు.

Also Read: రామ్ చరణ్, ఎన్టీయార్‌.. ఈ ఇద్దరిలో ఆ ‘ఆస్కార’మ్ ఎవరికి.?

ఈ మాఫియా ఫోకస్ ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ సినిమా మీద పడింది. భయంకరమైన ట్రోలింగ్ అప్పుడే షురూ అయ్యింది. విపరీతమైన నెగెటివ్ టాక్ ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు.

ఏం సాధిస్తారు.? సినిమా నష్టపోతే వాళ్ళకొచ్చే లాభయమేంటి.? అది ఏ సినిమా అయినా కావొచ్చుగాక.. ఏ హీరో నటించింది అయినా కావొచ్చుగాక.. ఒక పెద్ద సినిమా ఆడితే, ఇండస్ట్రీకి జోష్ వస్తుంది.

సినీ పరిశ్రమకు ఈ మాఫియా చీడ ఎప్పటికి వీడుతుందో ఏమో.!

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group