Anupama Parameswaran Attitude.. అనుపమ పరమేశ్వరన్‌కి పొగరెక్కువ.! ‘టిల్లు స్క్వేర్’ సినిమా పుణ్యమా అని, ఆమెకి ఆ పొగరు నషాళానికెక్కేసిందట.!
ఈ విషయాన్ని పరోక్షంగా హీరో సిద్దు జొన్నలగడ్డ సెలవిచ్చాడు. ఔనా.? నిజమా.? జస్ట్ ఫర్ ఫన్.! మా నిర్మాత కూడా అలాంటోడే.. మా హీరోయిన్ కూడా అలాంటిదే.. అని సిద్దూ చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు.
ఎందుకో, ‘టిల్లు స్క్వేర్’ సినిమా మొదలైనప్పటినుంచీ, హీరోయిన్ విషయంలో రచ్చ జరుగుతూనే వుంది. హీరోయిన్‌గా అనుపమ కన్ఫామ్ అయ్యింది.. ఆ తర్వాత ఆమె ‘నో’ చెప్పింది, తప్పుకుంది.. మళ్ళీ ఆమెనే తీసుకున్నారు.
తూచ్.. అదంతా ఏమీ లేదని, ‘టిల్లు స్క్వేర్’ యూనిట్ బుకాయించడానికి చాలా ప్రయత్నించింది. కానీ, తెరవెనుక వ్యవహారాలు ఎప్పటికప్పుడు లీక్ అవుతూనే వున్నాయ్.
Anupama Parameswaran Attitude.. అనుపమ ఆబ్సెంట్.. దేనికో మరి.?
తాజాగా, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సాధారణంగా అనుపమ పరమేశ్వరన్ తన సినిమా ప్రమోషన్లలో చాలా యాక్టివ్‌గా వుంటుంది.
మరి, ‘టిల్లు స్క్వేర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అనుపమ ఎందుకు హాజరు కాలేదబ్బా.? ఈ విషయమై హీరో సిద్దు జొన్నలగడ్డ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు.

రీసెంట్‌గా రిలీజ్ అయిన ఓ పోస్టర్ విషయమై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్, వెబ్ మీడియాలో వెకిలి రాతలు, యూ ట్యూబ్ థంబ్ నెయిల్స్.. ఇవన్నీ అనుపమకి ఆగ్రహం తెప్పించాయట.
అందుకే, అనుపమ ఈ ఈవెంట్‌కి రాలేదంటూ మీడియాకి క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు సిద్దు జొన్నలగడ్డ. నిజమే, పొటో మీద ట్రోలింగ్ జరిగిన మాట వాస్తవం.
ఫొటో వెనుక కథేంటి.?
కానీ, అనుపమ పరమేశ్వరన్ అనుమతి లేకుండా ఆ ఫొటోతో కూడిన పోస్టర్ బయటకు రాలేదు కదా.! పైగా, ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే చాలా కష్టం తెల్సా.? అని సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో అనుపమ చెప్పుకొచ్చింది కూడా.
సెట్స్ గురించి యాంకర్ ప్రశ్నిస్తే, దాన్ని తేడాగా అర్థం చేసుకున్నట్లుగా సిద్దూ బిల్డప్ ఇస్తే, అనుపమ ముసి ముసి నవ్వులు నవ్వేయడం చూశాం.

అన్ని విషయాల్లోనూ ఇంత సపోర్టివ్‌గా వున్న అనుపమ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డుమ్మా కొట్టిందంటే, తెరవెనుకాల ఏదో జరిగి వుండాలి. అనుపమ అలకపాన్పు ఎక్కిందన్నది తాజా ఖబర్.
ఎందుకు.? అంటే, అదైతే సస్పెన్స్.! అసలు విషయాన్ని దాచి, మీడియాని నిందించే ప్రయత్నం చేశాడు హీరో సిద్దు జొన్నలగడ్డ.
Also Read: జరగండి.. సిస్టమ్‌కి సిక్స్ ప్యాక్ మొగుడొచ్చాడు.!
‘డీజే టిల్లు’ సినిమా సమయంలో హీరోయిన్ పుట్టు మచ్చలపై ఓ సినీ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అప్పుడూ మీడియా కార్నర్ అయిపోయింది. ఇప్పుడూ అంతేనా.?