మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran Break Up Love Story) ఎప్పుడూ సరదాగా కనిపిస్తుంటుంది. తెరపై హండ్రెడ్ పర్సంట్ ఎనర్జీ చూపిస్తుంది. అందం, అభినయం కలగలిసిన కంప్లీట్ ప్యాకేజ్ అనుపమ. ఎప్పుడూ తెరపై మితిమీరిన అందాల ప్రదన్శన చేయలేదు ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ బోలెడంత మంది ఫాలోవర్సు మెచ్చేలా పోస్టులు పెడుతూంటుంది. తాజాగా అనుపమ తాను ఏడ్చి, తన అభిమానుల్నీ ఏడిపించింది. విషయమేంటంటే, అనుపమ జీవితంలోనూ ఓ బ్రేకప్ ఉంది.
ఒకర్ని అనుపమ గాఢంగా ప్రేమించింది. కానీ, ఆ ప్రేమ అనుపమకు కన్నీటినే మిగిల్చింది. అనుపమను చూస్తే, పక్కింటమ్మాయి గుర్తుకొస్తుంది. మనింట్లో అమ్మాయే అనిపిస్తుంది. అలాంటి అనుపమని ఎవరో బాధపెట్టారు అంటే, ఆమె అభిమానులు జీర్ణించుకోగలరా.? జీర్ణించుకోలేక తెగ బాధపడిపోతున్నారు.
ఇంతకీ, ఎవరా వ్యక్తి.? అనుపమను (Anupama Parameswaran) ఎందుకు కాదనుకున్నాడు.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టమే. క్రికెటర్ బుమ్రా పేరు గతంలో బాగా వినిపించింది అనుపమ పరమేశ్వరన్ లవర్ అంటూ. కానీ, ఇటు అనుపమ, అటు బుమ్రా ఇద్దరిలో ఎవరూ తమ మధ్య లవ్ ఉన్నట్లు ప్రకటించలేదు.
ఇటీవలే, బుమ్రా పెళ్లయిపోయింది. అక్కడితో ఆ గాసిప్స్‌కి తెర పడింది. కానీ, ఇప్పుడిలా అనుపమ బరస్ట్ అయ్యే సరికి కొందరు అనుపమ అభిమానులు, బుమ్రాని టార్గెట్ చేస్తున్నారు. కానీ, అనుపమ తనకు బ్రేకప్ (Anupama Parameswaran Break Up Love Story) బుమ్రాతో అయ్యిందని ఎక్కడా చెప్పలేదు.
ఇంతకీ, అనుపమను బాధపెట్టిన ఆ కఠిన హృదయుడు ఎవరు.? అనుపమ పరమేశ్వరన్‌కే తెలియాలి.
