Anupama Parameswaran Love Story.. మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ వుంది.
పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయదు. కానీ, క్యూట్ క్యూట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నాటీ గాళ్ అనిపించుకుంటుంది అనుపమ.
తాజాగా తన నాటీతనాన్ని మరోసారి ప్రదర్శించింది అనుపమ పరమేశ్వరన్. కొన్ని ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో వున్న ఫోటోల్ని నెట్టింట పోస్ట్ చేసింది.
వావ్.! వాట్ ఏ నాటీ.. ఏజ్ యూజ్‌వల్ క్యూటీ.. అంటూ నెటిజన్లు ఈ ఫోటోలకు కామెంట్స్ ఇస్తున్నారు.
ఏమో.. ప్రేమంటే ఏంటో నాకింకా పూర్తిగా తెలియలేదేమో.!
నా మనసుకు నచ్చినోడు దొరకడానికి సమయం పడుతుందేమో.! అయినా, నాకప్పుడే అంత తొందర లేదు..
ప్రస్తుతానికైతే సినిమా కెరీర్‌ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తున్నా..
Mudra369
అన్నట్లు అప్పుడెప్పుడో ఓ క్రికెటర్‌తో ప్రేమలో వుందంటూ అనుపమపై రూమర్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఆ లవ్ తూచ్.!
అయితే, ఆ క్రికెటర్‌కి ఆ తర్వాత పెళ్లయిపోయిందనుకోండి. ఆ సంగతి అటుంచితే, తాజాగా అనుపమ పరమేశ్వరన్ లవ్ మ్యాటర్ మరోసారి తెరపైకొచ్చింది.

తాను ఇంకా ప్రేమలోనే వున్నానని చెప్పుకొచ్చింది. సినిమాల్లో లవ్ స్టోరీస్ చూస్తుంటే భలే అనిపిస్తుందనీ, తనకు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని వుందని చెప్పింది అనుపమ.
అయితే, ప్రస్తుతం అనుపమ లవ్ మ్యాటర్ ఏంటని అడిగితే, తాను ఇంకా లవ్‌లోనే వున్నాననీ చెప్పుకొచ్చింది. అయితే, అది వన్‌సైడ్ లవ్ స్టోరీయేనట.
Anupama Parameswaran.. అనుపమ లవర్ ఎవరంటే.!
తన లవ్ విషయంలో అవతలి వాళ్లు ఏమనుకుంటున్నారో తనకి స్పష్టత లేదనీ చెప్పుకొచ్చింది. అయితే, అనుపమ లవ్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!
ఈ మధ్య అనుపమ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ స్టోరీలతో వెండితెరపై సందడి చేస్తోంది.

‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ కొట్టి, సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్.