Anveshi Jain Healthy Fitness.. అన్వేషి జైన్.. తెలుసు కదా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. అన్నట్టు, ఓ తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.
నటి, మోడల్, మోటివేషనల్ స్పీకర్ అయిన అన్వేషి జైన్, సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోల్ని షేర్ చేయడమే కాదు, మంచి మంచి మాటలూ చెబుతుంటుంది.
తాజాగా, అన్వేషి జైన్ ఫిట్నెస్ పాఠాలు వల్లిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలు కాస్తా వైరల్ అవుతున్నాయి.
అన్వేషి జైన్ ఫిట్నెస్ పాఠాలు చెప్పడమేంటి.?
ఔను కదా.? అన్వేషి జైన్ ఫిట్నెస్ పాఠాలు చెప్పడమేంటి.? ఫిట్నెస్ అంటే, శరీరంలో కొలతలన్నీ పక్కాగా వుండాలి కదా.? అనే డౌట్ మీకొచ్చిందా.? అయితే, మీ ఆలోచన తప్పు.!
లావుగా వున్నా, సన్నగా వున్నా.. ఫిట్టుగా వుండటం అనేది ముఖ్యం.! ఎంత బరువు వుండాలో అంత బరువు వుండడం ముఖ్యం.
అంతకు మించి, శరీరం మన మాట వినేలా వుండాలి. జన్యు పరమైన సమస్యల కారణంగా, అన్వేషి జైన్, ‘జీరో సైజ్’ కొలతలతో కూడిన ఫిజిక్‌ని సంపాదించలేదు. అది ఆమెకి సాధ్యం కాదు.
కానీ, తాను ఫిట్టుగా వున్నానని చెబుతుంటుంది అన్వేషి జైన్. అది నిజమే కూడా.! భారీగా పెరిగిపోయిన ‘చెస్ట్ పార్ట్’ వల్ల కొన్ని సమస్యల్ని అన్వేషి జైన్ ఎదుర్కొంది.. అవి మానసికంగా ఆమెను మొదట్లో చాలా ఇబ్బంది పెట్టాయి.

కుటుంబ సభ్యుల మద్దతు, మానసిక వైద్యుల సూచనలు, సలహాలతో అన్వేషి జైన్, తన బలహీనతను బలంగా మార్చుకుంది.
వర్కవుట్లు, యోగా, స్విమ్మింగ్, డాన్స్.. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడంతోపాటు, మానసిక ఆనందాన్నీ ఇస్తాయని చెబుతోంది అన్వేసి జైన్. అది కూడా నిజమే కదా.!