Table of Contents
Shefali Jariwala Mystery.. షెఫాలీ జరీవాలా అంటే, చాలా తక్కువ మందికి తెలుసేమో.! అదే, ‘కాంటా లాగా షెఫాలీ’ అంటే, చాలామందికి తెలుసు.
అప్పట్లో ‘కాంటా లాగా’ రీమిక్స్ సాంగ్ సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. మ్యూజిక్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది ‘కాంటా లాగా’.!
తన క్యూట్ అండ్ వైల్డ్ ఎక్స్‌ప్రెషన్స్, డాన్స్ మూమెంట్స్‌తో, తన గ్లామర్‌తో షెఫాలీ జరీవాలా, ఆ పాటకు అద్దిన ‘గ్లామరస్ అప్పీల్’ ఎలా మర్చిపోగలం.?
Shefali Jariwala Mystery.. షెఫాలీకి అసలేమైంది.?
షెఫాలీ జరీవాలాకి గుండె పోటు వచ్చిందనీ, ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధృవీకరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
అయితే, షెఫాలీ జరీవాలా మృతిపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. దాంతో, తీవ్ర గందరగోళం నెలకొంది ఆమె అభిమానుల్లో.

షెఫాలీ జరీవాలా హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా చేసింది చాన్నాళ్ళ క్రితం. ఆ షోలోనే కంటెస్టెంట్‌గా చేసిన సిద్దార్ధ శుక్లా, నలభయ్యేళ్ళ వయసులోనే అకాలమరణం చెందాడు.
ఇప్పుడు షెఫాలీ కూడా, అకాల మరణం చెందడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. షెషాలీ, సిద్దార్ధ శుక్లా అత్యంత సన్నిహితులు.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా..
షెఫాలీ జరీవాలా పలు సినిమాల్లో నటించింది. అందులో, కన్నడ సినిమా ఒకటుంది. సినిమా పేరు ‘హుడుగరు’. పునీత్ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించాడు.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘నాడోడిగల్’కి కన్నడ రీమేక్ ఈ ‘హుడుగరు’.

పునీత్ రాజ్‌కుమార్ కూడా చిన్న వయసులోనే, గుండె పోటుతో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే.
పునీత్ రాజ్‌కుమార్ మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది షెఫాలీ జరీవాలా.
వివాహం.. రెండు సార్లు..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే షెఫాలీ జరీవాలా, ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. మ్యూజీషియన్ హర్మీత్ సింగ్‌ని 2024లో పెళ్ళాడింది షెఫాలీ.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
అయితే, వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2029లో ఇరువురూ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు.
హర్మీత్‌తో విడాకులు తీసుకున్న ఐదేళ్ళకు, పరాగ్ త్యాగీని 2014లో పెళ్ళాడింది షెఫాలీ. పరాగ్ త్యాగీ కూడా నటుడే.