Anveshi Jain Jr NTR.. అన్వేషి జైన్.. సోషల్ మీడియా సెన్సేషన్. ఓ వెబ్ సిరీస్‌లో గతంలో నటించింది. తెలుగులోనూ ఇంతకు ముందే ఆమె ఓ సినిమా లాంటిది చేసింది.
తాజాగా, ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Rama Rao On Duty) సినిమాతో సందడి చేస్తోంది అన్వేషి జైన్. ఈ సినిమాలో ‘సీసా’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ చేసింది ఈ బ్యూటీ.!
సినిమా ప్రమోషన్లలో హీరోయిన్లు పెద్దగా కనిపించడంలేదు. ‘మజిలీ’ ఫేం దివ్యాన్ష కౌషిక్, కొత్తమ్మాయ్ రాజిషా విజయ్ ఈ సినిమాలో హీరోయిన్లు.
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకి సంబంధించి హీరోయిన్లతో పోల్చితే, ఐటమ్ బాంబ్ అన్వేషి జైన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
రామ్‌చరణ్‌తో డేటింగు.!
పలు యూ ట్యూబ్ ఛానళ్ళ ఇంటర్వ్యూలలో అన్వేషి జైన్, ఆయా ప్రశ్నలకు తనదైన స్టయిల్లో సమాధానమిస్తూ వస్తోంది. రామ్ చరణ్ ఫొటో చూపిస్తే, ‘గ్లోబల్ స్టార్’ అనేసిందిగానీ, అతని పేరు తెలియదు పాపం ఈ పాపకి.
తెలుగులో తొలి సినిమా కదా.? ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రమోషన్ల కోసం వచ్చిన అన్వేషి జైన్‌కి అన్నీ తెలియాలనే రూల్ ఏముంది.? ప్రభాస్ పేరు కూడా తెలియదు.. ‘బాహుబలి’ అని పేర్కొంది.

డేటింగ్ ఎవరితో చేస్తావ్.? అనడిగితే, రామ్ చరణ్ అని చెప్పింది. మహేష్‌బాబు అందగాడనీ, ఎన్టీయార్ మంచి నటుడనీ.. ఇలా తనకు తెలిసిన విషయాల్ని చెప్పింది అన్వేషి జైన్.
Anveshi Jain Jr NTR.. హీరోయిన్.. అయితే తప్పేంటట.?
అంతే, సోషల్ మీడియాలో ఆయా హీరోల అభిమానులు ట్రోలింగ్ షురూ చేశారు. ఈ క్రమంలోనే ‘జూనియర్ ఎన్టీయార్ సినిమాలో అన్వేషి జైన్ హీరోయిన్.. ఇది కన్ఫామ్..’ అంటూ టెకారాలు షురూ అయ్యాయ్.
Also Read: టార్గెట్ నాగచైతన్య.! సమంత ‘ఆపరేషన్’ సక్సెస్.!
ఏం, అన్వేషి జైన్ హీరోయిన్‌గా ఎందుకు నటించకూడదు.? అసలు హీరోయిన్ అంటే ఏంటి.? నటి లేదా నటుడు.. కథానాయకి, కథాయకుడు.. అంతేనా.!
ఏమో, అన్వేషి జైన్ స్టార్‌డమ్ పెరిగిపోయి, ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కే పరిస్థితి వస్తే.? ముమైత్ ఖాన్, సన్నీలియోన్.. వీళ్ళతో పోల్చితే.. అన్వేషి జైన్‌కి ఆ సీన్ రాకూడదన్న రూల్ ఏమీ లేదు కదా.!