Ariyana Glory BB Telugu.. పదహారణాల తెలుగందం అనాలనిపిస్తోంది కదా.! యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన పాపే ఈ పాప. పేరు గుర్తుందిగా అరియానా గ్లోరీ.!
జబర్దస్త్ అవినాష్ కాంబినేషన్‌లో బిగ్‌బాస్ హౌస్‌లో అరియానా పాప చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇంకేముంది అవినాష్‌తో పీకల్లోతు లవ్వు.. అని కూడా ప్రచారం జరిగింది.
అయితే, అదంతా కేవలం హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే.. అని తేలిందనుకోండి. బయటికొచ్చాకా కూడా కొన్ని రియాల్టీ షోలలో ఈ జంట సందడి చేసింది.
Ariyana Glory BB Telugu.. బిగ్ బాస్ క్రేజ్..
అసలు విషయమేంటంటే, అరియానా (Ariyana Glory) బిగ్ బాస్‌తో వచ్చిన ఫేమ్‌ని బా..గా.. వాడేసుకుంది. సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకుంది.
అలా వచ్చిన ఫేమ్‌తోనే నాలుగు రాళ్లు కూడా ఎనకేసుకుందనుకోండి. అన్నట్లు అప్పట్లో రాజ్‌తరుణ్‌తో ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించేసిందండోయ్. కాకపోతే, సెకండ్ హీరోయిన్‌గా.

బిగ్ బాస్ (Bigg Boss Telugu) తర్వాత సినిమా అవకాశాలూ ఆఫర్లూ అటుంచితే, అరియానా పాప సోషల్ మీడియా వేదికగా పొట్టి పొట్టి దుస్తుల్లో చేసిన గ్లామర్ హంగామా అంతా ఇంతా కాదు.
ట్రెడిషనల్ వేర్‌లో పాప గ్లామరూ కుర్రకారు బేజారు.!
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. అరియానాకి మంచి డ్రస్సింగ్ సెన్స్ వుందిలెండి. అయితే, స్కిన్ టైట్స్.. బికినీ వేర్స్.. అంటూ హాట్ హాటర్ హాటెస్ట్ పోజుల్తో కిక్కెక్కించిన అరియానా తాజాగా ట్రెండ్ మార్చింది.
ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమిచ్చింది. ఎల్లో కలర్ లంగా జాకెట్టు ధరించి క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోంది. ఈ తాజా అవుట్ ఫిట్‌లో అరియానాని చూసి కుర్రకారు బేజారవుతోంది.
Also Read: చీ పాడు.! ఓటీటీ అంటే, అదొక్కటే కాదుగానీ.!
ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే చూపించాల్సిన గ్లామర్‌ని మర్చిపోకుండా జాగ్రత్తగా హైలైట్ చేస్తున్న అరియానా ఈ అందాల పోజులు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్. కావాలంటే మీరూ ఓ లుక్కేస్కోండి.