‘కల్కి’ రగడ: విజయ్ దేవరకొండ ఏమంత పెద్ద తప్పు చేశాడని.?
Vijay Deverakonda Kalki Arjuna.. దర్శకుడు నాగ్ అశ్విన్, నటుడు విజయ్ దేవరకొండకి అత్యంత సన్నిహితుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో సినిమాలొచ్చాయ్.
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమాలోనూ ఆ స్నేహం కారణంగానే ఓ గెస్ట్ రోల్‌లో కనిపించాడు విజయ్ దేవరకొండ. అది అర్జునుడి పాత్ర.
అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరిగ్గా సూటవలేదన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న కామెంట్. డైలాగ్ డెలివరీ అసహ్యంగా వుందన్న విమర్శ కూడా వినిపిస్తోంది.
Vijay Deverakonda Kalki Arjuna.. తప్పెవరిది.?
స్నేహితుడు గనుక, సినిమాకి అదనపు స్టార్‌డమ్ అద్దొచ్చని బహుశా నాగ్ అశ్విన్ (Nag Ashwin), విజయ్ దేవరకొండని తీసుకొచ్చి వుండొచ్చు. ఇందులో తప్పేముంది.?
వాస్తవానికి, ‘కల్కి’ (Kalki 2898 AD)లో అర్జునుడి పాత్రకి అంత ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. చాలా తక్కువ నిడివి పాత్ర అది. ఎవరితో అయినా చేయించేసి వుండొచ్చు.
కానీ, తెరపై అర్జునుడిగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కనిపించగానే థియేటర్లో ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. విజిల్స్ పడ్డాయ్. ఈ మూమెంట్‌ని దర్శకుడు ముందే ఊహించాడు.
దాన్ని అలానే తీసుకోవాలి.. ఔను, సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అనే అనుకోవాలి. అదేమీ లెంగ్త్ వున్న పాత్ర కాదు కదా.. కామెంట్లేయడానికి.?
తెలంగాణ వర్సెస్ ఆంధ్రా..
మా తెలంగాణ హీరోని మీ ఆంధ్రోళ్ళు అవమానిస్తున్నారంటూ మధ్యలో తెలంగాణ – ఆంధ్ర రగడని తెరపైకి తెస్తున్నారు కొందరు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాలు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా బాగానే ఆడుతాయ్. మంచి మార్కెట్ వుందక్కడ విజయ్ దేవరకొండకి.
Also Read: విప్పితే.! నా తప్పు ఏమున్నదబ్బా.! అనసూయ కస్సు బుస్సు.!
రాష్ట్రాలుగా విడిపోవడం తప్ప, తెలుగు ప్రజల మధ్య ఏనాడూ విభజన జరగలేదు. అన్నదమ్ముల్లా కలిసి మెలిసే వుంటున్నారంతా.
సినిమా నచ్చకపోవడమో, ఇతరత్రా కారణాలో.. ఈ వివాదానికి కారణం అయి వుండొచ్చు. అగ్నికి ఆజ్యం పోసే క్రమంలో, ప్రాంతీయ వాదాన్ని కొందరు తెరపైకి తెస్తుండడం శోచనీయం.