అరియానా గ్లోరీ.. (Ariyana Glory Bigg Boss Telugu 4) ఓ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసిన ఈ భామ, బిగ్ బాస్ రియాల్గీ షో ద్వారా, అంచనాలకు మించి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమె వాయిస్ విషయంలో మొదటి నుంచీ కొన్ని కంప్లయింట్స్ వున్నాయి. అయితే, అది ఆమె నేచురల్ వాయిస్.
మొదట్లో కొంచెం గందరగోళంతో వున్నట్లు కనిపించినా, క్రమక్రమంగా అరియానా బిగ్ హౌస్‌లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్‌గా మారిపోయింది. టాస్క్‌లలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ, బిగ్ బాస్ వ్యూయర్స్ మనసుల్ని గెలిచేసుకుంటోంది.
నిజానికి, అరియానా ఎప్పుడో హౌస్ నుంచి ‘ఔట్’ అయిపోతుందని చాలామంది భావించారు. కానీ, క్రమక్రమంగా ఆమెపై గతంలోని అభిప్రాయాలు బిగ్ బాస్ వ్యూయర్స్‌కి మారిపోయి, కొత్త అంచనాలు ఏర్పడుతున్నాయి. అరియానా ఈ జోరు కొనసాగిస్తే, ఆమె టాప్ 5లో ఖచ్చితంగా చోటు దక్కించుకోవచ్చు.
ఆట విషయంలో పూర్తి ఫోకస్డ్‌గా వుంటుంది.. చాలా క్లారిటీతో ఆలోచిస్తుంటుంది. అబిజీత్‌ని మహా నాయకుడ్ని చేసిన రోబోట్స్ – హ్యామన్స్ టాస్క్‌లో, వాస్తవానికి అరియానా గ్లోరీ ప్లాన్ వర్కవుట్ అయి వుండాలి. అబిజీత్ అందుకు అనుమతించకపోవడంతో ఆమె ఆలోచనలు అమల్లోకి రాకుండా పోయాయి.
హౌస్‌మేట్స్‌తో టాస్క్స్ సందర్భంగా ‘పార్టనర్‌షిప్‌లు’ ఏర్పాటు చేసుకోవడం దగ్గర్నుంచి, అందరితోనూ కలివిడిగా వుంటూనే, తన ఆట తాను పెర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో, చాలా ఫోకస్డ్‌గా ఆడుతున్న వైనం బావుంది. హౌస్‌లో అవసరమైనప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో అస్సలేమాత్రం తగ్గడంలేదు.
‘స్టైలింగ్’లోనూ అరియానా మిగతా ఫిమేల్ కంటెస్టెంట్స్‌తో పోల్చితే చాలా కొత్తగా కనిపిస్తోంది. డ్రెస్సింగ్ స్టయిల్ నుంచి అన్నీ ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తున్నాయి. ‘ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్’ అనాల్సిన సమయంలో, అస్సలేమాత్రం ముందూ వెనుకా ఆలోచించడంలేదు అరియానా.. అదే సమయంలో అవసరమైనప్పుడు అందర్నీ కలుపుకుపోతోంది.
‘ఈ సీజన్‌లో మహిళా కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి..’ అని దేవి నాగవల్లితో చెప్పిన అరియానా (Ariyana Glory Bigg Boss Telugu 4), ‘ఒకవేళ నేను హౌస్ నుంచి వెళ్ళిపోతే నువ్వు గెలవాలి..’ అని దేవికి చెప్పడం గమనార్హం. కానీ, దేవి ఔట్ అయిపోయింది. మరి, అరియానా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అవుతుందా.? అవ్వాలంటే, ఇంకా ఆమె చాలా దూరం ప్రయాణం ఇంతే జోష్‌తో చేయాల్సి వుంటుంది.