పిచ్చి పీక్స్‌కి వెళ్ళడమంటే ఇదే మరి.! మంచి మనుషులట.. కొంటె రాక్షసులట. మొత్తంగా బిగ్‌బాస్‌ని పెంట పెంట చేసేశారు. చూసే వ్యూయర్స్‌కి మెంటలెక్కించేశారు. హౌస్‌లో ఏదో జరుగుతోంది.. ఏం జరుగుతోందో మాత్రం వ్యూయర్స్‌కి (Bigg Boss Telugu 4 Ariyana Glory Avinash) అర్థం కాలేదు.
పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు రాక్షసులు.. ప్రవచనాలు చెప్పారు మంచి మనుషులు. ఏందీ గోల.? కొంటె రాక్షసులన్నారుగానీ, పిచ్చి రాక్షసులనలేదు కదా.! మరెందుకు ఇంత ‘పిచ్చి’గా రాక్షసులు ప్రవర్తించినట్లు.? రాక్షసుల్ని మనుషులుగా మార్చే క్రమంలో వెర్రి వెంగళప్పల్లా ‘మంచి మనుషులు’ ఎందుకు తయారైనట్లు.?
Also Read: బిగ్ డౌట్: పిచ్చి రాక్షసులా? కొంటె రాక్షసులా?
డ్రమ్ముని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తే, డ్రమ్ముని నింపేసినట్లట. ఇదొక టాస్క్.. మళ్ళీ దీంట్లో బెస్ట్ పెర్ఫామర్స్. వరస్ట్ పెర్ఫామర్ ఎవరో తేల్చుకోలేకపోయారు కంటెస్టెంట్స్.. ఇదింకా పెద్ద కామెడీ. ఒకరు కాదు, హౌస్‌లో అందరూ వరస్ట్ పెర్ఫామర్సే.
ఇక, కెప్టెన్ నోయెల్ సీన్ (Noel Sean) చెప్పిన ప్రకారం అవినాష్ (Mukku Avinash), అరియానా (Ariyana Glory) బెస్ట్ పెర్ఫామర్స్. వాళ్ళిద్దరికీ కెప్టెన్సీ టాస్క్ జరగబోతోంది. ఎవరో ఒకర్ని కెప్టెన్‌గా ఎంపిక చేసెయ్యక.. మళ్ళీ ఇంకో భయంకరమైన టాస్క్‌ని బిగ్‌బాస్ ఇస్తున్నాడు.
ఇప్పటిదాకా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లలో ఒక్కటంటే, ఒక్కటి కూడా సజావుగా జరిగింది లేదు. అసలు ఏ టాస్క్ అయినా పద్ధతిగా జరిగితే కదా.! అవినాష్ (Avinash), అరియానా.. ఈ ఇద్దరూ ఈ వారం నామినేషన్స్‌లో వున్నారు.
Also Read: దివి, అరియానా, అవినాష్.. సూపర్ పవర్.!
ఎలిమినేషన్ (Bigg Boss Telugu 4 Elimination) కోసం. గెలిచినవాళ్ళు వచ్చే వారం నామినేషన్స్ (Bigg Boss Telugu 4 Nominations) నుంచి ఎస్కేప్ అవుతారు. అలా జరగాలంటే ఈ వారం ఎలిమినేషన్‌ని తప్పించుకోవాలనుకోండి. అది వేరే సంగతి.
చివరి వరకు రాక్షసుల బృందంలో నిలిచింది మెహబూబ్ మాత్రమే. అలా చూస్తే మెహబూబ్‌ని (Mehaboob Dilse) బెస్ట్ పెర్ఫామర్ అనాలి. కానీ, అలా జరగలేదు.
మంచి మనుషుల్లో బెస్ట్ పెర్ఫామర్ ఎవరూ లేరా.? అంటే, మోనాల్‌తోపాటు దివి (Divi Vadthya), లాస్య (Lasya Manjunath), అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar), సోయెల్ (Syed Sohel) మంచి పెర్ఫామెన్సే ఇచ్చారు. వెతికితే ఇలాంటివి చాలానే కనిపిస్తాయి.
బిగ్‌బాస్ ఏదో డిసైడ్ అయిపోయాడు.. దాని ప్రకారమే హౌస్‌లో కథ నడుస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?