300 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు నెలవారీ విద్యుత్ ఛార్జీలు (Arvind Kejriwal Announces Free Electricity In Goa) చెల్లించాల్సిన అవసరమే వుండదట. బంపర్ ఆఫర్ అదిరిపోయింది కదూ.! నిజంగానే ఇది బంపర్ ఆఫర్. అయితే, ఇక్కడ ‘కండిషన్స్ అప్లయ్’ వుందండోయ్. ఇది ఎన్నికల హామీ.
గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన ఎన్నికల హామీ ఇది. తమను గనుక గెలిపిస్తే, గత విద్యుత్ బిల్లులన్నీ కూడా మాఫీ చేసేస్తామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అంటే, గోవాలో 97 శాతం మంది ప్రజలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం వుండదట. రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందించేస్తారట.
Also Read: ఎన్నికల సిత్రం: ఓటేస్తే ఏడాదికి కోటి, హెలికాప్టర్, రాకెట్టు.. ఫ్రీ.!
దేశ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓ సంచలనం. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజరే పోరాటం చేయగా, ఆ బృందంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా వుండేవారు. ఆ తర్వాత, అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించి. దేశ రాజకీయాల్ని తనవైపుకు తిప్పుకున్నారు.
Also Read: టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని సంక్షోభమిది.!
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. పంజాబ్, ఉత్తరాఖండ్ అలాగే గోవా తదితర రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో వున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.
రాజకీయ పార్టీ అన్నాక రాజకీయాలే చేయాలేమోగానీ.. విద్యాధికుడైన అరవింద్ కేజ్రీవాల్, ఉచిత పథకాల పేరు చెప్పి (Arvind Kejriwal Announces Free Electricity In Goa) ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతవరకు సబబు.? అన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. 87 శాతం మందికి బిల్లులు లేకుండా చేసి, 17 శాతం మందికి మాత్రం బిల్లులు ఎందుకట.? మొత్తంగా తీసేస్తే పోలా.?