Ashika Ranganath Varaalu.. అదృష్టం కలిసొస్తే, తెలుగు ప్రేక్షకులు మనసుకు హత్తుకునే అవకాశమున్న అందగత్తె ఆషికా రంగనాధ్. ఎవరీ ఆషికా.. అనుకుంటున్నారా.?
అదేనండీ.! నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో ‘అమిగోస్’ సినిమాలో నటించింది. అందంగా కనిపిస్తూనే, కావల్సినంత అందాల విందు కూడా చేసింది ఈ సినిమాలో.
అయితే, సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో, పెద్దగా పేరు రాలేదీ ముద్దుగుమ్మకి. కన్నడలో పలు సినిమాల్లో నటించిన అనుభవం వుంది. కానీ,!
తెలుగులో తొలి సినిమాకి కరెక్ట్ రోల్ పడలేదనుకోవాలేమో. ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో కలిసి నటిస్తోంది ఆషికా రంగనాధ్. అదే ‘నా సామిరంగ’ సినిమా కోసం.
Ashika Ranganath Varaalu.. కాలం కలిసొస్తే.. పాతుకుపోయే టాలెంటే.!
ఈ సినిమాలో ఆషిక పాత్ర జస్ట్ గ్లామర్ మాత్రమే అనేలా కాదు.. పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్‌లా కనిపిస్తోంది. ‘వరాలు’ పాత్రలో ఈ సినిమాలో ఆషిక నటించబోతోందని టీజర్ ద్వారా తెలిసిపోయింది.
అలాగే, ‘ఎత్తుకెళ్లిపోవల్సిందే..’ పాట కోసం క్యూట్‌గా కనిపిస్తూనే, మన్మధుడు నాగార్జునతో ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ భీభత్సంగా పండించేసిందీ కన్నడ కస్తూరి.

సంక్రాంతికి ఘనంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియాలో ఆషిక రంగనాధ్ అందాల హంగామా మొదలెట్టేసింది.
క్యూట్ అండ్ హాట్ పోజులతో నెటిజన్స్‌ని తెగ ఆకర్షించేస్తోంది. బబ్లీ బబ్లీ సోయగాలతో కుర్రకారుకి వల గట్టిగానే విసురుతోంది.!
‘ఎంత సక్కగున్నావే వరాలు..’ అంటూ నెటిజన కవులు ఆషిక పాప అందాల్ని తెగ పొగిడేస్తున్నారు కూడా.
Also Read: జూనియర్ ఎన్టీయార్‌కి ఓటేసిన ‘యానిమల్’ భామ.!
ఇంకేముంది.! అన్నీ కలిసొచ్చి, ‘ నా సామిరంగ’ హిట్ అయితే, టాలీవుడ్‌లో మరిన్ని మంచి అవకాశాలు ఆషిక (Ashika Ranganath) తలుపు తడతాయనడం అతిశయోక్తి అనిపించడం లేదు.
ఎందుకంటే, పాపకి ఆ సత్తా వుంది. కాలం కలిసి రావాలంతే. ఒకే ఒక్క హిట్టు.. అదీ సరైన హిట్టు.. ఆషికా రంగనాథ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందంతే.!