Ashu Reddy.. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేయడం అందాల భామలకు కొత్తేమీ కాదు.
బిగ్ బాస్ ఫేం అషూ రెడ్డి ఇందుకు మినహాయింపేమీ కాదు. తాజాగా అషు రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఆమె ఫొటోల కంటే, ఆ ఫొటోల కోసం ఆమె పెట్టిన హ్యాష్ ట్యాగ్ ‘హాట్ టాపిక్’ అయ్యింది.
టాప్ లెస్.. అన్పించేలా ఫొటోల్ని పోస్ట్ చేస్తూ, ‘కాన్ఫిడెన్స్ ఈజ్ సెక్సీ’ అని పేర్కొంది అషు రెడ్డి. ఔనా.? అది నిజమా.? అంటూ నెటిజన్లు ఏకిపారేయడం మొదలు పెట్టారు.
కొందరైతే అసభ్యకరమైన కామెంట్లూ షురూ చేశారు. ముందే ఈ తరహా ట్రోలింగ్ ఊహించిందేమో.. ‘హేటర్స్’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించింది.

Ashu Reddy మాస్.. ఊర మాస్..
చూస్తోంటే, కేవలం హేటర్స్‌కి తన కాన్ఫిడెన్స్‌ని సెక్సీగా చూపించడానికే అషు రెడ్డి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిందనుకోవాలేమో.
గ్లామర్ పేరుతో వల్గారిటీ హద్దులెప్పుడో చెరిగిపోయాయ్. సోషల్ మీడియాలో ‘సెర్చ్’ కొడితే కుప్పలు తెప్పలుగా వల్గర్ ఫొటోలు చాలా గ్లామరస్‌గా దర్శనమిచ్చేస్తాయ్.

అన్నట్టు, ఇలాంటి హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే ఫాలోవర్స్ పెరుగుతారు.. అందులో హేటర్స్ ఎలాగూ వుంటారు.
వారలా ‘హేట్’ చేయడంతోనే, సెలబ్రిటీల పాపులారిటీ మరింత పెరుగుతుంది. అయినా, ‘అందం చూడవయా.. ఆనందించవయా..’ అన్నటుండగకుండా, ఈ ట్రోలింగ్ ఎందుకు చెప్మా.?
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
వాళ్ళకు చూపించడం ఇష్టం.. వీళ్ళకి ట్రోలింగ్ చేయడం ఇష్టం.. ఎవరి గోల వారిది.
అషు రెడ్డి కావొచ్చు, మరొకరు కావొచ్చు.. ‘హేటర్స్’ని కూడా పరిగణనలోకి తీసుకునే, సోషల్ మీడియాని ఎప్పటికప్పుడు మరింత హీటెక్కించేస్తూ తమ పాపులారిటీని పెంచుకుంటుంటారు.

పాపులారిటీ ఊరికినే రాదు కదా.! ఇలా సోషల్ మీడియాలో కష్టపడితేనే వస్తుందేమో.! కాస్తంత అందం… ఇంకాస్త తెలివి.. వెరసి, సోషల్ మీడియాని దున్నేస్తున్నారంతే.