Avantika Vandanapu Viral Beauty.. ఆమె పేరు అవంతిక.! ఒకప్పుడు బాలనటి.! ఇప్పుడేమో సెన్సేషనల్ స్టార్.! తెలుగులో బాలనటి.. హాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా ఎలా మారింది.?
అసలు ఎవరీ అవంతిక.? పూర్తి పేరు అవంతిక వందనపు.! మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో బాలనటిగా కనిపించింది.

అంతేనా.? పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ తదితర సినిమాల్లోనూ అవంతిక వందనపు కనిపించింది.
Avantika Vandanapu Viral Beauty.. అప్పుడలా.. ఇప్పుడిలా.!
పదహారణాల తెలుగమ్మాయ్.. తెలుగు చాలా చక్కగా, పద్ధతిగా మాట్లడింది.. అప్పట్లో.! కానీ, ఇప్పుడు ఆమె మాట్లాడే ఇంగ్లీష్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
రోమ్‌లో వున్నప్పుడు రోమన్‌లానే వుండాలి మరి.! అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయ్ అవంతిక, అమెరికన్ యాక్సెంట్‌లో అదరగొట్టేస్తోంది.!

అచ్చం హాలీవుడ్ నటిలా మారిపోయింది.! చూస్తున్నారు కదా.. ఆ గ్లామరూ, గ్రామరూ.! స్టైలిష్ లుక్.. అంతకు మించిన ఆటిట్యూడ్‌తో చెలరేగిపోతోంది అవంతిక వందనపు.!
సాధారణంగా మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి, తెలుగమ్మాయిలంటే ఒకింత చులకన.! ముంబై భామలైతే స్టైలిష్‌గా వుంటారు.. చెన్నయ్, బెంగళూరు అమ్మాయిలైనా ఓకే.. అన్న భావన వుంటుంది.
వైరల్ బ్యూటీ..
అవంతిక వందనపుని చూస్తే.. అలాంటి ఆలోచనలు పటాపంచలైపోవాల్సిందే.! అవంతిక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
మన తెలుగు సినిమాల్లోనే అవంతిక వందనపుకి ఛాన్సులు ఇచ్చి వుంటే.! ఇంకా నయ్యం, రెండు మూడు ఫ్లాప్ సినిమాలతో ‘ఫ్లాప్ హీరోయిన్’ అన్న ముద్ర వేసేసి, కెరీర్‌కి ఎండ్ కార్డ్ వేసేసేవాళ్ళే.!

అన్నట్టు, అవంతిక వందనపు మంచి డాన్సర్. సింగర్ కూడా.! సంగీతంలో ప్రావీణ్యం వుంది. సంప్రదాయ నృత్యంలోనూ ఆమెకు ప్రావీణ్యం వుంది.
‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా, మహేష్‌బాబుని ఇంటర్వ్యూ చేసేసింది ఈ అవంతిక.!
Also Read: సినిమా కారమ్.! ఇది యాపారం.! నిజాలు చెప్పమ్.!
ఆ సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయి సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు కదా.. హీరోయిన్‌గా అవంతిక వందనపుని ట్రై చేస్తే పోలా.?