అవినాష్ అలియాస్ ముక్కు అవినాష్ అలియాస్ జబర్దస్త్ అవినాష్.. (Avinash Bigg Boss Telugu 4) ఇప్పుడు బిగ్‌బాస్‌కి పెద్ద దిక్కుగా మారాడు. ఈ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో గ్లామరుంది.. టాలెంట్ వుంది. కానీ, దేన్నీ వాడటంలేదు బిగ్‌బాస్. టాస్క్‌లన్నీ దాదాపుగా దెబ్బకొట్టేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ఒక్కోసారి ‘అతి’ అనిపిస్తున్నా ఓవరాల్‌గా ‘వన్ అండ్ ఓన్లీ’ అన్నట్లుగా మొత్తం బిగ్‌బాస్‌ని తన భుజాన మోసేస్తున్నాడు అవినాష్. ‘కామెడీ ఓ సారి చేస్తే బావుంటుంది.. మళ్ళీ మళ్ళీ అదే చేస్తే చిరాకు పుడుతుంది..’ అని మోనాల్ విసుక్కున్నా, అవినాష్ కామెడీ మీద సుజాత కూడా గుస్సా అయినా.. చివరికి బిగ్‌బాస్‌లో అవినాష్ తప్ప వేరే దిక్కు లేకుండా పోతోంది నిర్వాహకులకి.
కామెడీ మాత్రమే కాదు, ఏ విషయాన్ని అయినా కుండబద్దలుగొట్టేయాలన్నా వెనుకాడ్డంలేదు అవినాష్. కెప్టెన్సీ టాస్క్ సమయంలో కాలు నొప్పితో బాధపడుతున్నా పూర్తి ఎఫర్ట్ పెట్టాడు ఈ కమెడియన్.
అబిజీత్ (Abijeet), అఖిల్ (Akhil Sarthak), మెహబూబ్ (Mehaboob Dilse), సోహెల్ (Syed Sohel Ryan), హారిక (Alekhya Harika), దివి (Divi Vadthya), అరియానా (Ariyana Glory), లాస్య (Lasya Manjunath), నోయెల్ (Noel Sean).. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరూ తక్కువ కాదు. సుజాత కావొచ్చు, అమ్మ రాజశేఖర్ కావొచ్చు.. చివరికి గంగవ్వ కూడా స్టఫ్ వున్న కంటెస్టులే.. అయినాగానీ, బిగ్‌బాస్ ఎందుకో నీరసంగా సాగుతోంది.
బహుశా ప్లానింగ్ బెడిసికొడుతుండొచ్చు. టాస్క్‌లు వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు. అది కాస్తా బ్యాక్ ఫైర్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ కామెడీ ఎక్కువ హైలైట్ అవుతోంది. ఈ రోజు (శుక్రవారం అక్టోబర్ 9) ఎపిసోడ్ విషయానికొస్తే.. ఫుల్ మార్క్స్ అవినాష్‌కే వెళతాయి. అలాగని అవినాష్ గొప్ప కామెడీ చేసేశాడా.? అంటే అదీ లేదు.
కానీ, బిగ్‌బాస్ వ్యూయర్స్ ఆ కాస్సేపు అయినా టీవీకి అతుక్కున్నారంటే అది కేవలం అవినాష్ వల్లనే. అన్నట్టు, వీకెండ్ షురూ అవుతోంది. కింగ్ నాగ్ శని, ఆదివారాల్లో హోస్ట్‌గా ఎలాంటి సందడి చేస్తాడో వేచి చడూఆలి. ఈ వీక్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి.
అరుచుకున్నారు, నానా యాగీ చేశారు కంటెస్టెంట్స్. వాళ్ళకి క్లాసులే తీసుకుంటాడో, పనిష్‌మెంట్స్ ఇస్తాడో.. ఏదీ లేదు, తుస్సుమనిపించేస్తాడో చూడాల్సి వుంది. అమ్మ రాజశేఖర్, సుజాత డేంజర్ జోన్‌లో వున్నారు. చాలా కొద్ది ఓట్ల తేడాతో అమ్మ రాజశేఖర్, సుజాత కంటే ముందున్నాడు.