Balakrishna Veera Simha Reddy ఔను కదా, నందమూరి బాలకృష్ణ చౌదరి, ‘వీర సింహా రెడ్డి’ అనే సినిమా ఎలా చేయగలిగాడు.?
అసలు ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఎందుకొస్తాయ్.! పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటే ఇదే.! వీర సింహా రెడ్డి అనేది ఓ పాత్ర మాత్రమే.! ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయినా, ఆయన పేరు పక్కన ‘చౌదరి’ అనే తోక లేదు.
ఓ హీరో సినిమా హిట్టయితే.. మా కులపోడు కాబట్టి హిట్టు కొట్టాడనే కుల పైత్యం.. ఓ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో సక్సెస్ అయితే, ‘మా కులపోడు’ అనడం.. ఇదిగో ఇలా పెరిగిపోతోంది కులగజ్జి.!
Mudra369
సరే, ఆ ‘తోక’ పెట్టుకోవడమనేది ఆయా వ్యక్తుల ఇష్టం. అందరూ అలా తోకలు తగిలించుకోవాలనే రూల్ ఏమీ లేదు.
Balakrishna Veera Simha Reddy తోక వల్ల వచ్చిన ప్రయోజనమేంటి.?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా, ఆయన పేరు చివర్న ‘నాయుడు’ వుంటుంది.
ఇంటి పేర్ల విషయానికొస్తే, ఒకే ఇంటి పేరు వేర్వేరు సామాజిక వర్గాల్లో వుండడం చూస్తుంటాం. అయినా, ఈ కులాల గోలేంటి.?
అదే మరి.! కులం ప్రస్తావన లేకుండా ఏదీ జరగడంలేదు ఈ మధ్యకాలంలో. అలా కొందరు, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ‘రెడ్డి’ గురించి నందమూరి బాలకృష్ణని విమర్శిస్తున్నారు.
సిగ్గుండాలి కదా.?
‘వీర సింహా రెడ్డి’ సినిమాలో కొన్ని రాజకీయ పరమైన డైలాగులు వుండడంతో, బాలయ్యను ప్రశ్నిస్తూ, కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలిలా వింత వాదనను తెరపైకి తెచ్చారు.
చిరంజీవి (Megastar Chiranjeevi) ‘ఇంద్ర’ (Indra) సినిమా చేశారు. అందులో పాత్ర పేరు ఇంద్ర సేనా రెడ్డి. దాంట్లో తప్పేముంది.?

చాలా సినిమాల్లో హీరోల పాత్రలు అనాధలుగా వుంటాయ్. అలాంటి సినిమాలు ఎన్నో సూపర్ హిట్స్ అయిన సందర్భాల్ని చూశాం.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ దెబ్బకి ‘దిల్’ రాజుకి పగిలింది.!
ఓ హీరో సినిమా హిట్టయితే.. మా కులపోడు కాబట్టి హిట్టు కొట్టాడనే కుల పైత్యం.. ఓ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో సక్సెస్ అయితే, ‘మా కులపోడు’ అనడం.. ఇదిగో ఇలా పెరిగిపోతోంది కులగజ్జి.!
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలనగానే ఫ్యాక్షన్ కథలే ఎక్కువగా వుంటాయ్. అలాగని, సినిమాలు చూసి అక్కడ హత్యా కాండలు పెరిగిపోతాయని అనగలమా.?
అలాగైతే, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో సినిమాలు చూస్తుంటాం. అంటే, సినిమాలే మాఫియాని పెంచి పోషిస్తున్నాయని అనొచ్చా.?
అత్యాచారాలపై ఎన్నో సినిమాలు చూశాం.. చూస్తున్నాం. అదీ అంతే. సినిమా వేరు.. అదో క్రియేటివ్ వ్యాపారం.! పైగా కళాత్మకమైన బిజినెస్.
దానికి ప్రాంతం, కులం.. ఇంకోటి ఆపాదిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.