Balakrishna JrNTR Flexi Fight.. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎలా చనిపోయారు.? అన్నదానిపై ప్రత్యేకమైన చర్చ అనవసరం.! ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే.!
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు జాతి ఆత్మ గౌరవం… ఈ విషయంపై చర్చ, రచ్చ.. మామూలే.!
సీనియర్ ఎన్టీయార్ చివరి రోజులు అత్యంత బాధాకరంగా గడిచాయి. ‘పగవాడిక్కూడా ఇలాంటి చావు రాకూడదు’ అని స్వర్గీయ ఎన్టీయార్ అభిమానులు కంటతడి పెట్టారు అప్పట్లో.! ఇప్పటికీ అదే మాట.!
అయ్యిందేదో అయిపోయింది.. స్వర్గీయ ఎన్టీయార్, తెలుగు నేలపై తనదంటూ ఓ ప్రత్యేకమైన సంతకాన్ని చేసి వెళ్ళిపోయారు. అదెప్పటికీ చెరగదు.
ముఖ్యమంత్రి అంటే ఎన్టీయార్.. అన్న గౌరవం ఆయనకి ఎప్పటికీ అలాగే వుండిపోతుంది.
Balakrishna JrNTR Flexi Fight.. జయంతికీ.. వర్ధంతికీ ఇదో పెంట.!
కానీ, ఎన్టీయార్ జయంతి అలాగే వర్ధంతి సందర్భంగా, ఎన్టీయార్ అభిమానులమనే ముసుగేసుకునే కొందరు రాజకీయ నాయకులు, అలాగే ఎన్టీయార్ కుటుంబ సభ్యులు.. ఆయన్ని ఇంకోసారి చంపేస్తున్నారు.
తాజాగా, జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీల్ని ఎన్టీయార్ ఘాట్ వద్ద అభిమానులు కొందరు ఏర్పాటు చేస్తే, ‘తీయించెయ్, వెంటనే..’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కసురుకున్నారు.
అభిమానుల అతి బాలయ్యకి తెలియదా.? తండ్రి సమాధి వద్ద ఈ తరహా ‘ఆవేశం’ కూడదన్న సోయ, బాలయ్యకి లేదా.? జూనియర్ ఎన్టీయార్ అభిమానులు హర్ట్ అయ్యారు.
రాజకీయ రోగమొకటి.!
ఇంకోపక్క, గోతికాడ నక్కల్లా కాచుక్కూర్చున్న రాజకీయ ప్రత్యర్థులు, దీన్నో బూతంలా చూపిస్తూ, బాలయ్య – జూనియర్ ఎన్టీయా మధ్య గ్యాప్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీటిని, స్వర్గీయ ఎన్టీయార్ ఆత్మ సమర్థిస్తుందా.? ఛాన్సే లేదు.!
‘వర్ధంతికో, జయంతికో నన్ను మీరు గుర్తు చేసుకోవాల్సిన పనిలేదు. నన్ను వివాదాల్లోకి లాగకుండా వుంటే అదే చాలు..’ అని స్వర్గీయ ఎన్టీయార్ ఆత్మ ఘోషిస్తూ వుంటుందేమో.!
ఇంతకీ, స్వర్గీయ ఎన్టీయార్‌కి భారతరత్న పురస్కారం అనే డిమాండ్ ఏమయ్యింది.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.!