Balakrishna Slams Jr NTR.. జూనియర్ నందమూరి తారక రామారావు విషయంలో నందమూరి బాలకృష్ణ వైఖరి ఏంటన్నది ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది.
తాజాగా, ఇంకోసారి.! ఈసారి ‘బ్రో.. ఐ డోంట్ కేర్..’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు, జూనియర్ ఎన్టీయార్ అభిమానులకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టయిన దరిమిలా, ఆ అరెస్టుపై జూనియర్ ఎన్టీయార్ స్పందించలేదు.
సినిమా వేరు.. రాజకీయం వేరు..
సినిమా వేరు రాజకీయం వేరు.. అనుకోవడానికి వీల్లేదిక్కడ. చంద్రబాబు స్వయానా జూనియర్ ఎన్టీయార్‌కి మేనత్త భర్త. ఆ లెక్కన, కుటుంబ సభ్యుడన్న కోణంలో అయినా, యంగ్ టైగర్ ఎన్టీయార్ స్పందించి వుండాల్సిందనేది ఓ వాదన.
ఏమో, జూనియర్ ఎన్టీయార్‌కి చంద్రబాబు విషయమై ఎలాంటి ‘అభిప్రాయం’ వుందో.! స్పందించకపోవడం.. స్పందించడం.. అన్నవి జూనియర్ వ్యక్తిగత వ్యవహారాల కోణంలో చూడలేం.. అన్న వాదనా లేకపోలేదు.
ఎవరి గోల వారిది.! బాలయ్య మాత్రం ‘ఐ డోంట్ కేర్..’ అనకుండా వుండాల్సింది. ‘ఆ విషయం అతన్ని అడగండి’ అని మీడియా అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానం చెప్పి వుండాల్సింది.
Balakrishna Slams Jr NTR.. బాలయ్య టెంపర్‌మెంట్..
‘చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీయార్ స్పందించలేదు కదా..’ అని మీడియా, బాలయ్యను అడిగితే, బాలయ్య కొంత టెంపర్‌మెంట్ ప్రదర్శించారు. అదిప్పుడు టీడీపీకి చేటు చేసేలా వుంది.
టీడీపీలో జూనియర్ ఎన్టీయార్ అభిమానులు వేరన్న ప్రచారం ఈనాటిది కాదు. జూనియర్ ఎన్టీయార్‌కి టీడీపీ పగ్గాలు ఇచ్చేయాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది.
చాలా సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకి కూడా జూనియర్ ఎన్టీయార్ అభిమానులు ప్రదర్శించిన జెండాలతో చికాకు పుట్టింది కూడా.!
Also Read: పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ కలిస్తే.! ‘కమ్మ’గా ‘కాపు’ కాసే కలయికే.!
కొడాలి నాని విషయమై చాలాకాలం క్రితం జూనియర్ ఎన్టీయార్‌ని బాలకృష్ణ నిలదీయడం అప్పట్లో పెను దుమారానికి కారణమయ్యింది.
మళ్ళీ ఇప్పుడు, ఇలా.! ‘ఐ డోంట్ కేర్’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు, జూనియర్ ఎన్టీయార్ అభిమానులకి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
కుటుంబ సంబంధిత కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీయార్‌ని బాలయ్య పట్టించుకోకపోవడం, ఆయా సంద్భాల్లో జూనియర్ ఎన్టీయార్ అభిమానులు కొంత యాగీ చేసినా, తర్వాత ‘అందరూ నందమూరి కుటుంబ సభ్యులే కదా’ అని సర్దుకుపోవడం తెలిసిన సంగతులే.!