Table of Contents
Ban Kantara Chapter1.. కన్నడ ‘కాంతార’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే.
రిషబ్ శెట్టి ఈసారి ‘కాంతార చాప్టర్ 1’ అంటూ మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది.
జూనియర్ ఎన్టీయార్‌కి రిషబ్ శెట్టి అత్యంత సన్నిహితుడు. సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం, జూనియర్ ఎన్టీయార్ వచ్చాడు కూడా.!
Ban Kantara Chapter1.. బ్యాన్ ఎందుకు చెయ్యాలి.?
ఈ మధ్య కర్నాటకలో, తెలుగు సినిమాలకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనలు చేస్తున్నారు. థియేటర్ల వద్ద గందరగోళం సృష్టిస్తున్నారు.
దాంతో, సహజంగానే తెలుగునాట కన్నడ సినిమాలకీ సెగ షురూ అయ్యింది. ‘కాంతార చాప్టర్ 1’ సినిమాని బ్యాన్ చెయ్యాలంటూ నినాదాలు జోరందుకుంటున్నాయి.

రిషబ్ శెట్టి, తన సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్ వచ్చాడు.. జూనియర్ ఎన్టీయార్‌ని ఆ కార్యక్రమానికి రప్పించుకున్నాడు. కానీ, వేదికపై నుంచి తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించలేదు.
ఉపేంద్ర, సుజీత్.. ఎందరో కన్నడ స్టార్లు..
కన్నడ నటుడు ఉపేంద్రకి, తెలుగునాట తిరుగులేని స్టార్‌డమ్ వుంది. సుజీత్‌ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. కన్నడ నటీమణులకు తెలుగునాట దక్కే గౌరం వేరే లెవల్.
అనుష్క, రష్మిక.. చెప్పుకుంటూ పోతే, హీరోయిన్ల లిస్టు చాలా పెద్దదే. వీళ్ళంతా కన్నడ బ్యూటీలే మరి.! చక్కగా తెలుగులో మాట్లాడతారు కన్నడ హీరోయిన్లంతా.
తెలుగులో మాట్లాడలేకపోవడం నేరమేమీ కాదు. కాకపోతే, కాస్తయినా ప్రయత్నించాలి కదా. మన తెలుగు హీరోలు, కర్నాటక వెళితే, కన్నడ మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.
ఆవేదన అలాంటిది..
‘కాంతర చాప్టర్ 1’ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే, రిషబ్ శెట్టి, ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలి.
అదే సమయంలో, భాషల పేరుతో సినిమాలకు వివాదాలు ఆపాదించడం సబబు కాదు. కర్నాటకలో కొందరు చేసిన ‘అతి’, తెలుగు సినీ అభిమానులకు ఆవేదన మిగిల్చిన మాట వాస్తవం.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
అదే పని, తెలుగు సినీ అభిమానులు కన్నడ సినిమాల విషయంలో చేస్తే, వాళ్ళకీ మనకీ తేడా ఏముంటుంది.? అన్నది ఇంకో వాదన.!
అయితే, మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే ఊరుకునేది లేదన్నది సగటు తెలుగు సినీ అభిమాని అభిప్రాయం. అదీ నిజమే కదా.!
