Beauty Enhancement ‘వయసొస్తే వంకర కాళ్లు తిన్నగా వస్తాయంటారు..’ పెద్దలు. అంటే ఎదిగేకొద్దీ.. అందం దానంతట అదే ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది.. అనేది పెద్దల మాట. ఇదే మాటని ‘పద్దెనిమిది ఏళ్లు నిండాయా చాలు.. నువ్వే కాదు ఎవరైనా అందంగుంటారు.. అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో తన హీరోయిన్ రష్మిక మండన్నని పొగిడేశాడు.
అంతేనా.. ‘ఎర్ర చందనం చీర కడితే, రాయైనా రాకుమారే..’అంటూ మరో పొగడ్త కూడా అందుకున్నారు పుష్పరాజ్ (Pushpa Raj Allu Arjun) తన శ్రీవల్లి (Rashmika Mandanna Srivalli) మీద. ఇంతకీ ఈ అందగత్తెల గోలేంట్రా బాబూ.. అంటారా.? అవునండీ, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అదే మరి. అందం.
Beauty Enhancement రంగు.. స్మార్ట్ హంగు.!
కొందరికి పుట్టుకతోనే స్వతహాగా అందం వస్తుంది. మంచి రంగు, ముఖ కవళికలు అదేనండీ, ఫేస్ ఫీచర్స్ అన్నీ చెక్కినట్లుగా పుట్టేస్తారు. ఇంకొందరైతే కొని తెచ్చుకున్న అందాలు, అవేనండీ సర్జరీలు చేయించుకుంటారు కదా.. హీరోయిన్లు కొందరు చేయించుకున్నట్లు అలా.. కొని, కోరి తెచ్చుకున్న అందమన్న మాట. డబ్బుంటే అంతే మరి, అందం ఎంత కావాలంటే అంత కొని తెచ్చేసుకోవచ్చు మరి.

అన్నట్టు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఓ చిత్రమైన ఉచిత సలహా ఇచ్చేసింది సోషల్ మీడియా వేదికగా. ఈ మధ్య మొబైల్ ఫోన్లలో సరికొత్త యాప్స్ అందుబాటులో వుంటున్నాయి గ్లామర్ పెంచుకోవడానికి. నిజానికి, అవి గ్లామర్‌ని పెంచేవి కావు.. గ్లామర్‌ని ఫిల్టర్ చేసి ఇతరులకు చూపించేవి మాత్రమే.
మీ అందం.. మీ చేతుల్లోనే.!
‘మిమ్మల్ని మీరుగా అంగీకరించండి. ఇతరులూ అంగీకరించేలా చెయ్యండి. అంతేగానీ, మీ లుక్కుని వింతగా మార్చేసే యాప్స్ జోలికి వెళ్ళొద్దు. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ లెక్చర్ దంచేసింది రియా చక్రవర్తి.
Also Read: మేకప్పు.. Radhika Apte బిల్డప్పు.!
చక్కనమ్మ ఏం చెప్పినా అందమే.. అని ఇలాంటి సందర్భాల్లో అనలేం కదా.? చెప్పేవి నీతులు.. దూరేవి డాష్ డాష్ అన్నట్టుంది పరిస్థితి. సహజసిద్ధమైన అందాన్ని కాదని, అడ్డగోలు సర్జరీల్ని ఆశ్రయించడం.. మేకప్ పేరుతో శరీరానికి అడ్డమైన పూతలూ పూయడం.. ఇవన్నీ చేసేసి, ‘మీరు మాత్రం, స్మార్టుగా ఫిల్టర్లు వాడొద్దు’ అంటే ఎలా.?
సహజ అందానికంటే మిన్నగా మరింత అందంగా (Beauty Enhancement) కనిపించాలనుకుంటే.. అప్పుడు అవసరమైతే మేకప్పూ వాడాలి.. ఇంకాస్త గ్లామరస్‌గా కన్పించడానికి స్మార్ట్ ఫిల్టర్లూ వాడాలి. అయితే, అతి సర్వత్ర వర్జయేత్. దేన్నయినా, అతిగా వాడితే కొంప మునుగుతుంది. అద్గదీ అసలు సంగతి.