Table of Contents
Betting Apps Influencers.. ఇన్‌ఫ్లూయెన్సర్స్.. ఈ మాట ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం.
ఏదన్నా సినిమా ప్రమోషన్ కోసం అయినా, ఏదన్నా వ్యాపారం అయినా.. ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో.
అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే చాలు, దేన్నయినా ప్రమోట్ చేసేస్తారు ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు.! మంచి, చెడు.. అన్నది అస్సలు ఆలోచించరు.
సోషల్ మీడియాలో నానా ఛండాలం చూపించడం ద్వారా మెజార్టీ ఇన్‌ఫ్లూయెన్సర్లు పాపులారిటీ పెంచుకుంటుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే.
Betting Apps Influencers.. ఏ స్థాయికైనా దిగజారడమే ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రత్యేకత..
అర్థ నగ్న దృశ్యాలు కావొచ్చు.. పూర్తి నగ్న దృశ్యాలు కావొచ్చు.. పాపులారిటీ పెంచుకోవడానికి దేనికైనా తెగించడం ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లకే చెల్లింది.
అసలు విషయానికొస్తే, బెట్టింగ్ యాప్స్ నుంచి ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లకు గత కొంత కాలంగా పెద్ద మొత్తంలో సొమ్ములు అందుతున్నాయ్. దాంతో, వాటిని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళంతా.
తాజాగా, తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ మీదా, వాటిని ప్రమోట్ చేస్తున్నవారిపైనా ఉక్కుపాదం మోపడం షురూ చేసింది.
అంతే, కలుగులోంచి ఎలకల్లా ఒకరొకరుగా బయటకు వస్తున్నారు ఇన్‌ఫ్లూయెన్సర్లు. ‘తెలిసో, తెలియకో తప్పు చేశాం.. క్షమించండి..’ అంటూ వీడియోలు విడుదల చేస్తున్నారు.
బెట్టింగ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల లిస్టు చాంతాడంత..
ఆ లిస్టులో సినీ నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత కూడా వుంది. ‘తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను.. తప్పు తెలుసుకున్నాను..’ అంటూ వీడియో విడుదల చేసింది సుప్రీత.
‘ఈజీ మనీ కోసం కక్కుర్తి పడి కొందరు వీటిని ప్రమోట్ చేస్తున్నారు.. అందులో నేనూ వున్నాను..’ అని సుప్రీత చెప్పడం గమనార్హం.
అంటే, డబ్బు ఇస్తే.. ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడ్డానని చెప్పకనే చెబుతున్నట్లు కదా.? ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతో మంది ప్రాణాల్ని తీసేశాయ్. అదీ అసలు సమస్య.
ప్రాణాలు పోతున్నా.. కాసుల కక్కుర్తి..
బెట్టింగ్ వల్ల ప్రాణాలు కోల్పోతారని తెలియనంత అమాయకులా ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు.?
నిజానికి, ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల మీదా, వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్ల మీదా హత్య కేసులు నమోగు చేయాలన్నది సర్వత్రా వినిపిస్తున్న డిమాండ్.
బుల్లితెర యాంకర్ శ్యామల (వైసీపీ అధికార ప్రతినిథి కూడా), సినీ నటి నిధి అగర్వాల్, నటుడు ప్రకాష్ రాజ్.. తదితరులూ బెట్టింగ్ యాప్స్‌ని తమదైన శైలిలో ప్రమోట్ చేసినవాళ్ళే. మరి, వీళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షించే పరిస్థితి వుంటుందా.?