Bheemla Nayak Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే, అదో జాతర.. అదో పండగ అభిమానులకి. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, పవన్ కళ్యాణ్‌ని ద్వేషించేవారికీ కంటి మీద కునుకు వుండదు ఆయన సినిమా విడుదలయ్యేరోజున.
అన్నట్టు, తనను పవర్ స్టార్ అనొద్దని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పినా, అభిమానులే కాదు.. కొందరు పొలిటికల్ లీడర్స్ కూడా ఆయన్ని పవర్ స్టార్ అనుకుండా వుండలేకపోతున్నారనుకోండి.. అది వేరే సంగతి.
Bheemla Nayak Review.. ఫస్ట్ డే ఫస్ట్ షో రిపోర్ట్ ఏంటంటే.!
ఇంతకీ, పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ సంగతేంటి.? ఫిబ్రవరి 24 సాయంత్రం నుంచి సోషల్ మీడియా కనీ వినీ ఎరుగని రీతిలో హోరెత్తిపోతోంది. ఆ మాటకొస్తే, ట్రైలర్ వచ్చినప్పటనుంచీ ‘హంగామా’ కొనసాగుతోందిలెండి.
ఇక, ఫిబ్రవరి 24 సాయంత్రం మొదలైన సోషల్ హోరు, అర్థరాత్రి.. ఆ పైన కొనసాగుతూనే వుంది. యూఏఈ, అమెరికా తదితర దేశాల్లో ప్రీమియర్ షోలు.. తెలంగాణలో పడ్డ స్పెషల్ షోలు.. వెరసి, టాక్ అర్థరాత్రికే దాదాపు ఖాయమైపోయింది.
సినిమా ప్రారంభమయ్యింది.. పది నిమిషాలు, పావుగంట, అరగంట.. గంట.. ఇలా సమయం గడుస్తోందిగానీ. లైవ్ అప్‌డేట్స్ రివ్యూల రూపంలో రాకపోవడంతో అభిమానులు కొంత అయోమయానికి గురయ్యారు. అయితే, ఇదంతా యునానిమస్ సూపర్ హిట్ టాక్ వచ్చేటప్పుడు వుండే నిశ్శబ్దమనే భావన కొందరిలో కలిగింది.
పవన్ కళ్యాణ్ ‘పవర్’ జాతర ఇదీ.!
అభిమానుల అంచనాలే నిజమయ్యాయి.. ఫస్టాఫ్ రిపోర్ట్ వచ్చేసింది.. రిపోర్ట్ ఏంటంటే.. బ్లాక్ బస్టర్ మూవీ అని. అదేంటీ, సినిమా సగ భాగానికే పూర్తి సినిమాకి సంబంధించిన టాక్ చెప్పేస్తారా.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ అలాంటిది.
ఇక, అక్కడి నుంచి అప్‌డేట్స్ హోరు పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఫేస్ ఆఫ్ సీన్స్, వాటికి తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ.. వీటన్నిటికీ మించి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సాగర్ చంద్ర డైరెక్షన్.. ఇలా ఒక్కో దాని గురించీ కథలు కథలుగా చెప్పే క్రమం మొదలైంది.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
సినిమా పూర్తయ్యే సరికి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. అంతకు మించి.. మోర్ దేన్ బ్లాక్ బస్టర్.. అంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో రిపోర్ట్ బయటపెట్టేశారు యునానిమస్‌గా.
అస్సలేమాత్రం నెగెటివిటీ లేకుండా ఇటీవల ఏదన్నా సినిమా వచ్చిందంటే బహుశా అది ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak Review) మాత్రమే కావొచ్చేమో.!