Bheemla Nayak.. ‘భీమ్లా నాయక్’ సినిమా చుట్టూ చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. ఈ సినిమాని థియేటర్లలో కాకుండా, నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ఛాన్సే లేదని ఇప్పటికే పలు మార్లు చిత్ర యూనిట్ స్పష్టం చేస్తూ వచ్చింది. అయినా గాసిప్స్ ఆగడం లేదు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ పరమైన కార్యక్రమంలో మాట్లాడుతూ, అవసరమైతే తన సినిమాని ఉచితంగా ధియేటర్లలో ప్రదర్శించి చూపిస్తానని చెప్పడంతో మళ్లీ ఓటీటీ పుకార్లకు బలం వచ్చింది. ఓటీటీలో విడుదల చేస్తామనడం వేరు. అవసరమైతే ధియేటర్లలో ఉచితంగా సినిమా చూపిస్తాననడం వేరు. దానికీ, దీనికీ తేడా తెలియని వాళ్లే పుకార్లు సృష్టిస్తున్నారు.
Bheemla Nayak.. అలా ఎలా.?
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ప్రచారం కారణంగా, ‘భీమ్లా నాయక్’ సినిమాపై ఓటీటీ హైప్ బాగా పెరిగిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు కనీ వినీ ఎరుగని స్థాయిలో భారీ రేటుతో ఈ సినిమాకి ఆఫర్లు ఇస్తున్నాయట. అదెంత నిజమో తెలీదు కానీ, ఈ ప్రచారం పవన్ అభిమానులకి కొంచెం టెన్షన్ కలిగిస్తున్నా, బోలెడంత కిక్కు ఇస్తోంది.

‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో చాలా గందరగోళం చూశాం. అదంతా సినిమాకి అదనపు పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఎవరైతే, సినిమాని ఫ్లాప్ అన్నారో వాళ్లే ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధించిందని అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది. దటీజ్ పవన్ కళ్యాణ్.
సంక్రాంతి వెరీ వెరీ స్పెషల్.. కానీ..
వాస్తవానికి 2022 సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది. అదే సమయంలో కొంత గందరగోళంతో కూడుకున్నది కూడా. కారణం ‘ఒమిక్రాన్’. ఏ చిన్న తేడా వచ్చినా పెద్ద సినిమాలు సంక్రాంతి షాక్ తినేస్తాయి. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ ఓటీటీ వైపు చూస్తే మాత్రం అది చాలా చాలా స్పెషల్ అవుతుంది తప్ప ‘భీమ్లా నాయక్’కి వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చు.
Also Read: మెగా నందమూరి ‘గిల్లుడు’.. అలియా భట్ ఆశ్చర్యం.!
అయితే, పవన్ అభిమానులకు ధియేటర్ కిక్ ఇవ్వాలనే ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్ర నిర్మాణ సంస్థ గట్టి పట్టుదలతో ఉంది.