Bhimavaram Jr NTR: సెలబ్రిటీలు ఏం మాట్లాడినా తంటానే. రోజులే అలా తగలడ్డాయ్. ‘అమ్మా.! అంటేనే ఇంకోటేదో బూతు ధ్వనిస్తున్న రోజులివి. అలాంటిది కావాలనే వివాదాల జోలికి వెళితే ఎలా.?
యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) పుసుక్కున నోరు జారేశాడు. కావాలనే నోరు జారాడా.? ఏదో అనుకోకుండా అనేశాడా.? కావాలనే నోరు జారి వుండాలి. ఎందుకంటే, చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాలనుకున్నది చెప్పేశాడు.
విషయమేంటంటే, కీరవాణి (MM Keeravani) సంగీతం అందించిన ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ఓ పాట విషయమై తన అభిప్రాయాన్ని ఎన్టీయార్ కుండ బద్దలుకొట్టేశాడు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన సినిమా అది.
ఆ ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘భీమవరం బుల్లోడా..’ పాట అస్సలు నచ్చదట ఎన్టీయార్‌కి. ఈ విషయాన్ని స్వయంగా కీరవాణితోనే ఎన్టీయార్ చెప్పేయడం గమనార్హం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఇంటర్వ్యూ అది.
Bhimavaram Jr NTR.. బుల్లోడా.. ఏంటీ భీమవరం రగడ.?
ఆ పాట, అందులోని లిరిక్స్, దాంతో పాటు మ్యూజిక్.. ఇవన్నీ తనకు చిరాకు తెప్పిస్తాయని ఎన్టీయార్ చెప్పాడు. చెబితే చెప్పాడులే.. నిజంగా ఆ పాట నిండా డబుల్ మీనింగులే. కానీ, మాస్ బీటున్న సాంగ్ అది. అప్పట్లో సెన్సేషనల్ హిట్ ఆ సాంగ్. ఆ పాటని ఆ తర్వాత సుమంత్ (Sumanth) సినిమా కోసం రీమిక్స్ చేశారు కూడా.
మళ్లీ ఇంకోసారి రీరీమిక్స్ చేయాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయ్. సరే, ఎన్టీయార్‌కి ఆ పాట నచ్చకపోవడం అది ఆయన ఇష్టం. అందరికీ అన్నీ నచ్చాలని రూలేం లేదు కదా.
అబ్బో, ఇందులో రాజకీయం కూడా వుందా.?
అయితే, ఆ పాటలోని భీమవరం, ఆ భీమవరం చుట్టూ రాజకీయం.. ఇలా ఎటునుంచి ఎటో లింకులు కలిపి, తెలుగుదేశం పార్టీకీ (Telugu Desam Party), జనసేన పార్టీకి (Jana Sena Party) ఫిటింగులెట్టేశాడో ప్రబుద్దుడు. పిచ్చికయినా లిమిట్ వుంటుందేమో కానీ, ఈడి పిచ్చి రాతలకు మాత్రం హద్దూ అదుపూ వుండదు.
Also Read: Rowdy Boys Telugu Review.. ఈ యువోత్పాతమేమిటో.!
బోడి గుండుకీ, మోకాలికీ ముడేశాయాలనుకునే ప్రయత్నం ఇలాగే వుంటుంది మరి. ఇక ఎన్టీయార్ (Young Tiger NTR) దగ్గరికి వద్దాం. ‘భీమవరం బుల్లోడా..’ సాంగ్‌తో పోలిస్తే అంతకన్నా జుగుప్సాకరంగా వుండే పాటల్లో ఎన్టీయార్ (Jr NTR) కూడా నటించాడు.
ఆ విషయం ఎన్టీయార్‌కి (Junior Nandamuri Taraka Ramarao) తెలియదని ఎలా అనుకోగలం.? అయినా, అడిగి మరీ కీరవాణి తన పాటకి ఇంత చెడ్డ పేరు ఎన్టీయార్ ద్వారా ఎందుకు తెచ్చినట్లు.? ‘ఆర్ఆర్ఆర్’ పబ్లిసిటీ కోసం ఇలా వెకిలితనం ప్రదర్శించడం ఎంతవరకూ సబబు మరకతమణి.!