Table of Contents
Bholaa Shankar Disaster Propaganda.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాపై నడుస్తున్న ‘విపరీతమైన నెగెటివిటీ’ ఇంకా ఎందుకు చల్లారడంలేదు.?
తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు, ఏ సినీ పరిశ్రమలో అయినా డిజాస్టర్లు మామూలే. సూపర్ హిట్స్ అరుదుగా వస్తుంటాయ్. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఈ సినీ పరిశ్రమలో.
కానీ, ‘భోళా శంకర్’ మీద నడుస్తున్న నెగెటివిటీ, యావత్ సినీ పరిశ్రమలో ఇంతవరకూ ఎప్పుడూ చూడనిది. ఎందుకిలా.?
నెగెటివ్ పబ్లిసిటీ ఖర్చు..
మామూలుగా అయితే, సినిమాలపై పబ్లిసిటీ కోసం నిర్మాణ సంస్థలు అదనంగా ఖర్చు చేయడం చూస్తుంటాం.
కానీ, ‘భోళా శంకర్’ విషయంలో, కొన్ని రాజకీయ పార్టీలు.. కొన్ని మీడియా సంస్థలు.. అదనంగా ఖర్చు చేస్తున్నాయి.. అదీ దుష్ప్రచారం కోసం.
మీడియా సంస్థలు తమ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. నిజానికి, అది దుర్వినియోగం కాదు.. అమ్మేసుకోవడం.!
Bholaa Shankar Disaster Propaganda.. గంపగుత్తగా కొనేశాయ్..
కొన్ని వెబ్ సైట్లు.. కొన్ని యూ ట్యూబ్ ఛానళ్ళు.. సోషల్ మీడియా హ్యాండిల్స్.. వీటన్నిటినీ, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు గంప గుత్తగా కొనేశాయి.. అదీ కొంత స్పేస్‌ని.

వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్లు ఖర్చు చేశారట, ‘భోళా శంకర్’ మీద దుష్ప్రచారం చేయడం కోసం.
చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని భయమా.? లేక, ఇంకోటేదైనా బలమైన కారణం వుందా.? ప్చ్.. కేవలం రాజకీయ భయంతోనే ఇదంతా జరుగుతోంది.
పెయిడ్ మాఫియా ఓ సినిమాని చంపెయ్యగలదా.? చంపెయ్యగలదనడానికి ‘భోళా శంకర్’ రిజల్ట్‌ని ఉదాహరణగా చెప్పొచ్చేమో.
ఓ సినిమా తీసెయ్యొచ్చునట.
ఈ నెగెటివిటీ కోసం రెండు ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చుతో ఓ చిన్న సినిమా తీసెయ్యొచ్చట.
రాజకీయానికి కుల జాడ్యం తోడై.. సినిమాని ఇదిగో ఇలా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
Also Read: పవన్ కళ్యాణ్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ వీడియో.!
ఆ ఖర్చంతా.. ఆ ప్రయత్నమంతా.. వృధా ప్రయాసే.! ఎందుకంటే, చిరంజీవి అంటే వ్యక్తి కాదు.. శక్తి.! ఈ తరహా నెగెటివిటీ ఇంతకు ముందూ వుంది. దాన్ని ఆయన అధిగమించారు.
కాకపోతే, ఇప్పుడు నెగెటివిటీ సోషల్ మీడియా వేదికగా, వెబ్ మీడియా వేదికగా మరింత నగ్నంగా.. నిస్సిగ్గుగా.. కనిపిస్తోందంతే.!
నెత్తుటి కూడుకీ.. కక్కిన కూడుకీ ఎగబడుతున్న వెబ్ పాత్రికేయం.. సోషల్ మీడియా పైత్యం.. వీటికి తోడు రాజకీయ, కుల జాడ్యం.. ఇవన్నీ సినీ పరిశ్రమే కాదు, యావత్ సమాజానికి అత్యంత హానికరం.!